OTT Releases This Week: ఓటీటీలోకి క్లాసిక్‌ హిట్ మూవీస్ -ఈ వారం రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఏవంటే-list of new movies and web series releasing this week on various ott platforms ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  List Of New Movies And Web Series Releasing This Week On Various Ott Platforms

OTT Releases This Week: ఓటీటీలోకి క్లాసిక్‌ హిట్ మూవీస్ -ఈ వారం రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఏవంటే

Nelki Naresh Kumar HT Telugu
May 05, 2023 11:18 AM IST

OTT Releases This Week: ఈ వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ్ముడుతో పాటు ధ‌నుష్ త్రీ, ప్ర‌భాస్ యోగి సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వీటితో పాటు రిలీజైన కొత్త సినిమాలు ఏవంటే..

ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి
ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి

నెట్‌ఫ్లిక్స్‌

మీట‌ర్

కిర‌ణ్ అబ్బ‌వరం హీరోగా న‌టించిన మీట‌ర్ మూవీ శుక్ర‌వారం (నేడు)నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి ర‌మేష్ క‌డూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ద్వారా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ్ముడు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ్ముడు మూవీ నెటిఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు అందుబాట‌లోకి వ‌చ్చింది. పీఏ అరుణ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. త‌మ్ముడు సినిమాలో ప్రీతి జింగానియా, అదితి గోవిత్రిక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు.

ధ‌నుష్ త్రీ మూవీ

ధ‌నుష్ హీరోగా ఐశ్వ‌ర్య‌ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త్రీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్ర‌వారం రిలీజైంది. సైక‌లాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ్లాప్ అయినా ధ‌నుష్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ప్ర‌భాస్ యోగి

నారా రోహిత రౌడీ ఫెల్లో

అమృతం చంద‌మామ‌లో

ది ఎమోజీ మూవీ (ఇంగ్లీష్‌)

తూ జోగీ మాయ్ మ‌క్క‌ర్ (హిందీ) మూవీ

డిస్నీ హాట్‌స్టార్‌

సాస్ బాహు ఔర్ ఫ్లామింగో (వెబ్ సిరీస్‌)

క‌రోనా పేప‌ర్స్ (మ‌ల‌యాళం మూవీ)

స‌న్ నెక్స్ట్‌

ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి

నాగ‌శౌర్య‌, మాళ‌వికా నాయ‌ర్ జంట‌గా శ్రీనివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి సినిమా స‌న్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. భిన్న ద‌శ‌ల్లో సాగిన ఓ జంట ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

ఈటీవీ విన్‌

మ్యాచ్ ఫిక్సింగ్ తెలుగు మూవీ

ఆహా ఓటీటీ

గీతా సుబ్ర‌హ్మ‌ణ్యం తెలుగు వెబ్ సిరీస్ సీజ‌న్

రిపీట్ ఆహా త‌మిళ్‌

IPL_Entry_Point