Jr NTR Remembers Harikrishna: హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌-jr ntr remembers harikrishna on his birth anniversary ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jr Ntr Remembers Harikrishna On His Birth Anniversary

Jr NTR Remembers Harikrishna: హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

Hari Prasad S HT Telugu
Sep 02, 2022 01:36 PM IST

Jr NTR Remembers Harikrishna: హరికృష్ణ జయంతి సందర్భంగా అతన్ని గుర్తు చేసుకున్నారు తనయులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌. ట్విటర్‌లో హృదయాన్ని తాకే సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో)
తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫొటో) (Twitter)

Jr NTR Remembers Harikrishna: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా అతని తనయులు, టాలీవుడ్‌ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ఘనంగా నివాళులర్పించారు. ట్విటర్‌లో ఇద్దరూ ఒకే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. మీ 66వ జయంతి రోజున మిమ్మల్ని స్మరించుకుంటూ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ ఫొటోని ట్వీట్‌ చేశాడు.

అందులో హరికృష్ణకు నివాళి అర్పిస్తూ ఓ హృద్యమైన సందేశం ఉంది. "ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే. నందమూరి కల్యాణ్‌రామ్‌, నందమూరి తారక రామారావు" అని ఆ నివాళిలో రాశారు. జూనియర్‌ ఈ ట్వీట్‌ను శుక్రవారం (సెప్టెంబర్‌ 2) ఉదయం 9 గంటలకు చేశాడు.

ఆ కాసేపటికే కల్యాణ్‌ రామ్‌ కూడా ఇదే ఫొటోతో ట్వీట్ చేశాడు. తమ తండ్రిని స్మరించుకుంటూ ఈ అన్నదమ్ములు చేసిన ట్వీట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. వాళ్లు కూడా తమ అభిమాని నటుడికి అశ్రు నివాళి అర్పించారు. హరికృష్ణ 2018 ఆగస్ట్‌ 29న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన నడిపిస్తున్న వాహనం బోల్తా పడటంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతకు కొన్నాళ్ల ముందు ఇదే ప్రాంతంలో హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జయరామ్‌ కూడా ఇలా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. 1964లో బాలనటుడిగా హరికృష్ణ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్యలాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్