Hansika 105 Minutes OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక సైకలాజికల్ థ్రిల్లర్ 105 మినిట్స్.. ఎక్కడ చూడాలంటే?
Hansika 105 Minutes OTT Streaming: హన్సిక నటించిన 105 మినిట్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే క్యారెక్టర్ తో ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
Hansika 105 Minutes OTT Streaming: హన్సిక మోత్వానీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ సినిమా రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
హన్సిక 105 మినిట్స్ ఓటీటీ
హన్సిక నటించిన ఈ 105 మినిట్స్ మూవీ గురువారం (మార్చి 28) నుంచే ప్రైమ్ వీడియోలోకి రావడం విశేషం. సింగిల్ క్యారెక్టర్ తో ప్రయోగాత్మకంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. కనీసం ఇంటర్వెల్ కూడా లేకుండా థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది. ఈ మూవీలో 34 నిమిషాల సీక్వెన్స్ తాను సింగిల్ టేక్ లో చేసినట్లు అప్పట్లో హన్సిక చెప్పింది.
అయితే ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్నేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న హన్సిక.. గతేడాది మై నేమ్ ఈజ్ శృతితోపాటు ఈ ఏడాది మొదట్లో ఈ 105 మినిట్స్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే పాత్రతో ఒకే షాట్ లో తీసిన ఈ మూవీ.. ఇండియన్ సినిమాలో ఇలాంటి తొలి ప్రయోగమని మేకర్స్ చెప్పారు.
రెండు నెలల తర్వాత ప్రైమ్ వీడియోలోకి వచ్చినా.. ఇప్పుడు కూడా రూ.99 రెంట్ చెల్లిస్తేనే ఈ మూవీ చూసే అవకాశం ఉంది. ఈ సినిమా ఫ్రీగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది సదరు ఓటీటీ వెల్లడించలేదు. ఈ సినిమాను రాజు దుస్సా డైరెక్ట్ చేశాడు.
ఏంటీ 105 మినిట్స్ మూవీ?
తన కెరీర్‌లోనే డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా 105 మినిట్స్ నిలుస్తుందని హన్సిక గతంలో తెలిపింది. ఈ సినిమా మొత్తం తన క్యారెక్టర్‌తో మాత్రమే ఉంటుందని అన్నది. సినిమా మొత్తం సింగిల్ షాట్‌లోనే చేశామని ఆమె చెప్పింది.
105 మినిట్స్‌లో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో చేశానని ఆమె చెప్పడం విశేషం. ఈ సీన్ కోసం ఎనిమిది రోజుల పాటు రిహార్సల్స్ చేశానని తెలిపింది. కేవలం గంటా 40 నిమిషాల నిడివితోనే రిలీజైన ఈ సినిమాకు ఇంటర్వెల్ కూడా లేకపోవడం మరో విశేషం.
తెరపై కేవలం హన్సిక పాత్రమే కనిపించినా.. మూవీలో బ్యాక్‌గ్రౌండ్లో మరో వాయిస్ మాత్రం వినిపిస్తుంది. జనవరి 26న ఈ 105 మినిట్స్ మూవీ థియేటర్లలో రిలీజైంది. అల్లు అర్జున్ దేశముదురుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఒప్పుడు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నది.
కందిరీగ, దేనికైనా రెడీతో పాటు పలు సినిమాలతో విజయాల్ని అందుకున్నది. తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. నవతరం హీరోయిన్ల పోటీ, పరాజయాల కారణంగా కొంతకాలంగా అవకాశాల రేసులో వెనుకబడిన హన్సిక సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్‌తో పాటు మరె రెండు సినిమాలు చేస్తోంది హన్సిక. 2022లో ప్రియుడు సోహైల్ కథురియాను పెళ్లాడింది హన్సిక. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే సినిమాలు చేస్తోంది.