Guppedantha Manasu May 27th Episode: రోధించిన జగతీ.. వసుకు బ్రేకప్ చెప్పిన రిషి.. ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసి..!-guppedantha manasu 2023 may 27th episode rishi miss judges jagathi and vasudhara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu 2023 May 27th Episode Rishi Miss Judges Jagathi And Vasudhara

Guppedantha Manasu May 27th Episode: రోధించిన జగతీ.. వసుకు బ్రేకప్ చెప్పిన రిషి.. ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసి..!

Maragani Govardhan HT Telugu
May 27, 2023 02:44 PM IST

Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో రిషి వెళ్లిపోతుంటే ఆపడానికి జగతీ, వసు ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ససేమీర వారి మాటలు వినడు. ముఖ్యంగా జగతీని తన మాటలతో ఏడిపిస్తాడు. కొడుకుకు ద్రోహం చేసిన తల్లి అంటూ బాధపెడతాడు.

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్

Guppedantha Manasu May 27th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో రిషినే చెక్కు పంపించాడని వసుధార చెప్పడంతో అతడు దోషి అని తేలతాడు. అందుకు శిక్షగా డీబీఎస్టీ కాలేజ్ ఎండీ పదవీ నుంచి వైదొలగాల్సిందిగా జగతీనే చెప్పేలా శైలేంద్ర ప్లాన్ ఫలిస్తుంది. అయితే అంతలో అతడి ప్లాన్ కూడా బెడిసి కొడుతుంది. కాలేజ్ ఎండీగా జగతీని నియమిస్తున్నామని, రెండు నెలల క్రితమే రిషి తనకు ఈ విషయం లెటర్‌లో ప్రస్తావించాడని మినిస్టర్ అంటారు. దీంతో శైలేంద్ర ఎండీ కావాలనే కల రివర్స్ అవుతుంది. వసుధార అబద్ధం చెప్పడం, జగతీ కాలేజ్‌కు దూరంగా ఉంచడంతో బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. వెళ్లిపోతున్న అతడిని జగతీ, వసుధార ఆపే ప్రయత్నం చేస్తారు.

రిషి మాటలకు రోధించిన జగతీ

ఈ బాధను మోయడం నా వల్ల కావట్లేదు మేడం, నమ్మి పోసపోయాను అంటూ రిషి వాపోతాడు. వసుధార, జగతీ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. రిషి నిన్ను కాపాడుకోవడం కోసమే ఈ విధంగా వసు అబద్ధం ఆడాల్సి వచ్చిందని, ఇందులో వసు తప్పేమి లేదని అంటుంది. అవును మేడమ్ తప్పంతా నాదే, నమ్మడం నాదే తప్పంటూ రిషి బాధపడుతుంటాడు. అయినా ఓ మనిషిని కాపాడటానికి వాడి వ్యక్తిత్వాన్ని చంపేస్తారా? ఏం పాపం చేశాను నేను.. మీ కడుపున పుట్టడం నేను చేసిన నేరమా? అన్నదమ్మడులు మోసం చేయడం, భార్య-భర్తలు ద్రోహం చేసుకోవడం చూస్తాం.. కానీ కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి మోసం చేస్తుంది మేడం అనగానే జగతీ గుండెలు పగిలేలా రోధిస్తుంది. నన్ను నమ్ము రిషి నేను నిన్ను ద్రోహం చేయాలేదు అంటూ ఏడుస్తుంది. ఇది ద్రోహం కాదు.. దీన్ని నమ్మించడానికి మాటలు లేవనుకుంటా అంటూ మరింత బాధపెడతాడు రిషి. ఆమె ఎంత చెప్పినా వినడు. మనుషులు పుడతుంటారు, చస్తుంటారు.. కానీ మీరు బతికుండగానే చంపేశారని రిషి బాధపడతాడు. నన్ను బయటకు పంపించడానికి సాక్ష్యాధారాలతో నిరూపించారని అంటాడు.

ఏ తల్లి కూడా కొడుకును అన్యాయం చేయదని జగతీ బాధపడుతుంది. అవును నిజమే.. ఎక్కడో చదివాను చెడ్డ కొడుకు ఉంటాడు కానీ.. చెడ్డ తల్లి ఉండదని. మీరు నాపై అనర్హత వేటు వేశారు కదా.. అలాగే నేను మిమ్మల్ని చూడటానికి, మాట్లాడటానికి వీలు లేకుండా అనర్హుడిని చేయండి. అని రిషి అంటాడు. చిన్నతనంలో నన్ను వద్దనుకున్నట్లుగానే.. ఇప్పుడు కూడా వద్దనుకోండి అంటూ జగతీతో అంటాడు. ఈ మోసగాడిని ఒంటరిగా వదిలేయండి అని వెళ్లబోతుంటాడు. అంతలో జగతీ మాట్లాడుతూ.. మీ నాన్న అడిగితే నేను ఏం సమాధానం చెప్పమంటావ్. అని ప్రశ్నిస్తుంది. మోసం చేసి పారిపోయాడని చెప్పండని రిషి బదులిస్తాడు. ముఖం చెల్లక, తలెత్తుకోలేక ఎటో వెళ్లిపోయాడని చెప్పండి అని అంటాడు. ఆయన నేను మోసగాడు అంటే నమ్మరేమో.. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించండి, నేను కచ్చితంగా తప్పు చేశానని అర్థమయ్యేలా చెప్పండి. అని అంటాడు.

జగతీని అమ్మా అని పిలిచిన రిషి.. కానీ

రిషి ఈ అమ్మను క్షమించు..అని జగతీ వేడుకుంటుంది. ఇందుకు రిషి బదులిస్తూ "మీరు నన్ను వదిలి వెళ్లిన తర్వాత ఎంతో క్షోభ ఎదుర్కొన్నాను. కానీ మీరు మళ్లీ వచ్చిన తర్వాత మీరు వెళ్లిన కారణంగా కరెక్టేనేమో అని అనుకున్నాను. అందుకే చాలా సార్లు అమ్మా..! అని పిలవాలనుకున్నాను. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని క్షమించడానికి నేను ఎవరిని? తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదనుకుంట. కానీ కొడుకుగా కాపాడుకుంటున్నానని కారణం చెప్పి.. వ్యక్తిగా నన్ను చంపేశావ్ కదమ్మా?" అని మొదటి సారి అమ్మా అని అంటాడు. ఇందుకు జగతీ ఓ పక్క సంతోషపడుతూనే మరోపక్క బాధపడుతుంది. రిషి.. నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా? అని జగతీ అనగానే.. జీవితంలో ఇంక ఈ పిలుపు మీరు వినలేదనే బెంగ ఉండకూడదని పిలిచాను.. ఇంక నేను మీ జీవితాల్లోకి రానని చెబుతాడు. అనంతరం అక్కడ నుంచి రిషి వెళ్లిపోతాడు.

వసును తోసేసి వెళ్లిన రిషి..

కానీ వసుధార మాత్రం అతడిని వెనక నుంచి కౌగిలించుకుని వెళ్లొద్దని వేడుకుంటుంది. ఈ దృతరాష్ట్ర కౌగిలి అంటూ వదిలించుకోడానికి ప్రయత్నిస్తాడు. వసు మాత్రం వదలకుండా అలాగే పట్టుకుని నేను విడిచి నేను ఎక్కడికి వెళ్లను అంటుంది. కానీ రిషి బలవంతంగా విడిపించుకుని ఆమెను తోసి.. "నన్ను ముట్టుకోకు, తాకకు.. నీకు ఆ అర్హత లేదని అంటాడు. ఓ మనిషికి ప్రాణం ముఖ్యమని నువ్వన్నప్పుడు.. రిషి ధారలకు మాత్రం ప్రేమే ముఖ్యమని నేనన్నాను. కానీ ఆ ప్రేమను నువ్వు చంపేశావ్ వసుధార అని రిషి కోపగించుకుంటాడు. నువ్వు చెప్పింది అబద్ధం అని నేను నిరూపించగలను.. కానీ అందరి ముందు నువ్వు చిన్నబోవడం నాకు ఇష్టం లేక చేయని తప్పునకు దోషిగా నిలుచున్నాను. ప్రేమంటే స్వర్గమని అనుకున్నాను.. కానీ నరకం అని నువ్వు నిరూపించావు. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అని తెగేసి చెప్పేస్తాడు రిషి.

వసు ఉన్నచోట ప్రశాంతంగా ఉండలేనన్న రిషి..

మరోపక్క వసుధార.. సార్ మీరు ఎన్ని అన్నా పడతాను.. కానీ మిమ్మల్ని కాపాడుకోడానికే చేశానని బతిమాలుకుంటుంది. కానీ రిషి మాత్రం ఒప్పుకోడు. "ఎప్పుడైతే నవ్వు నన్ను మోసం చేశావో అప్పుడే నేను చనిపోయానట్లే.. ఇంక నువ్వు కాపాడుకోవడమేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నేను దాపరికాలు లేని ప్రేమను కోరుకున్నాను.. కానీ నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూనే బతికావు, దాపరికాల్లోనే బతికావ్" అంటూ నిందిస్తాడు. ఆమె ఎంత చెప్పినా వినిపించుకోడు. "నేను కూడా మీతోపాటే వస్తాను, మీతోనే ఉంటాను" అంటూ వసుధార బతిమాలాడుతుంది. "కానీ నేను మాత్రం నువ్వున్న చోట నేను ఉండలేను. పెద్దల కుదిర్చిన బంధంతో నువ్వు మా ఇంట్లో ఉంటానంటే ఉండు.. కానీ నేను మాత్రం అక్కడ ఉండను. నువ్వు నా పక్కను ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను" అంటూ తెగేసి చెబుతాడు. అంతటితో ఆగకుండా ఎంగేజ్మెంట్ రింగును తీసేసి ఆమె చేతిలో పెడతాడు. మన బంధం మనం పెట్టుకున్న పేరు రిషిధార.. ఇప్పుడు వసుధార మాత్రమే మిగిలుంది అని రిషి అనడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point