Brahmamudi 16th may : పూజ గదిలో కావ్య హారతి ఇచ్చినా తీసుకోని అపర్ణ-brahmamudi serial today episode 16th may aparna fires on kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi 16th May : పూజ గదిలో కావ్య హారతి ఇచ్చినా తీసుకోని అపర్ణ

Brahmamudi 16th may : పూజ గదిలో కావ్య హారతి ఇచ్చినా తీసుకోని అపర్ణ

HT Telugu Desk HT Telugu
May 16, 2023 10:54 AM IST

Brahmamudi Today Episode : బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న తిరిగి రావడంతో సీరియల్ ఆసక్తిగా సాగుతుంది. ధాన్యలక్ష్మి ఏడుపు చూసిన కావ్య.. ఏమైంది అని అడుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే?

బ్రహ్మముడి
బ్రహ్మముడి

ఓ వైపు ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన కావ్య వచ్చి.. ఏమైంది అని అడుగుతుంది. మీ ఇద్దరి మాటలు విన్నానని, నీ తరఫున రాజ్ ని నిలదీస్తే.. ఇది మా భార్యాభర్తల విషయం కల్పించుకోవద్దు అని చెప్పాడని చెబుతుంది. నిజానికి కల్యాణ్ కంటే రాజ్ ని ఎక్కువగా ముద్దు చేసేవాడినని గుర్తు చేసుకుంటుంది. పెద్దవాడు అయిపోయాడు.. కన్నతల్లిని కాదు.. పరాయిదాన్ని అయిపోయాను అని బాధపడుతుంది.

అయితే ధాన్యలక్ష్మి బాధపడుతుండటం చూసిన కావ్య.. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం పట్టించుకోవద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్ చెప్పింది నిజమే.. రాజ్ ది చిన్నపిల్లల మనస్తత్వమే.. కానీ చిన్న పిల్లోడు కాదు కదా అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న రెడీ అయి బయటకు వచ్చే సమయంలో కనకం ఉంటుంది. అమ్మకు ఏదో ఒకటి చెప్పి బయటకి వెళ్లాలని స్వప్న ఆలోచిస్తుంది. బొమ్మలు శుభ్రం చేస్తుంటే.. ఈ పనులు నీకెందుకు నువ్ వెళ్లి వంట చేసుకోమని చెబుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది? నటిస్తుందా? లేదా మారిపోయిందా అని అనుమానం కలుగుతుంది. మెల్లగా కనకాన్ని ఇంట్లోకి పంపుతుంది.

ఆ తర్వాత స్వప్న మెల్లగా రాహుల్ ని కలిసేందుకు వెళ్తుంది. ఇంకోవైపు కావ్య ఇంట్లో పూజ గది శుభ్రం చేసి దీపం పెడుతుంది. పూజ ఎవరు చేస్తున్నారని.. అందరూ కిందకు వస్తారు. అపర్ణ వచ్చి చూసేసరికి కావ్య దేవుడికి హారతి ఇస్తూ కనిపిస్తుంది. దీంతో అపర్ణకు కోపం పెరిగిపోతుంది. కావ్య హారతి తీసుకొచ్చి ఇచ్చినా తీసుకోకుండా అపర్ణ ముఖం తిప్పేసుకుంటుంది. ఇంటి తాళాలు కూడా ఇవ్వమని వెటకారంగా అంటుంది. ఇచ్చే రోజు వచ్చింది.. ఇచ్చేయండి అత్తయ్య అని చెబుతుంది.

పూజ గదిలో అత్తయ్య తర్వాత నేను తప్ప ఎవరూ రాలేదని అపర్ణ చెబుతుంది. ఎవరు పడితే వాళ్లు అడుగుపెడితే ఎలా? అని ప్రశ్నిస్తుంది. ఈమె ఎలా వచ్చింది.. ఇంత ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు అని అంటుంది. నీకు వీలు కాలేదని నేను రమ్మను అని ఇంద్రాదేవి చెబుతుంది.

నేను ఒక నిర్ణయం తీసుకుంటే మీరు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని అపర్ణ గట్టిగా చెబుతుంది. మీరే నా మాటకి విలువ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఎలా విలువ ఇస్తారని అంటుంది. ఎంతో పవిత్రంగా చూసుకునే పూజ గదిలోకి ఎందుకు పంపించారు ఏం అర్హత ఉందని అడుగుతుంది. రాజ్ తన మెడలో తాళి కట్టాడని ధాన్యలక్ష్మి చెబుతుంది. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది ఎందుకు ఒప్పుకోవు అని ప్రశ్నిస్తుంది. ప్రపంచానికి దుగ్గిరాల ఇంటి వారాసుడికి భార్యగా పరిచయం చేశారని అంటుంది. నువ్వు ఇలా మొండిగా ఉంటేనే.. ఈ ఇంట్లో కావ్యకి విలువ లేకుండా పోయిందని చెబుతుంది. నువ్వు ఇలా ఉండబట్టే కావ్యని ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకి పంపించేద్దామా అని ఎదురుచూస్తున్నారని అంటుంది. కోడలు ఉండాల్సిన చోటే ఉంటుంది.., కొద్దిగా మానవత్వం చూపించమని కోపంగా వెళ్తుంది.

ఇక అపర్ణ ఈ మాటలతో సీరియస్ అవుతుంది. చొరవ ఇస్తే ధాన్యలక్ష్మికి కూడ అలుసు అయిపోయానని, తనని పూజ గదిలోకి పంపించడానికి వీల్లేదని చెప్పేస్తుంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కావ్య ఉందని.., అపర్ణ కూర్చునేందుకు నిరాకరిస్తుంది. కానీ ఇంద్రాదేవి సర్ది చెప్పి.. కూర్చొబెడుతుంది. రాజ్ వెళ్లబోతుంటే ధాన్యాలక్ష్మి కౌంటర్ వేసేసరికి వెళ్ళకుండా ఉంటాడు. రేఖ కావాలని టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా కలుపుతుంది. తిన్న వెంటనే అందరూ ఊసేస్తారు. ఏమైంది నీకు అనేవాళ్లకు ఇంకా అనే ఛాన్స్ ఇవ్వాలా అంటుంది. ఏమి తెలియనట్టు మళ్లీ రుద్రాణి అందరినీ పస్తులు ఉంచావు కదా అనేస్తుంది. అన్ని విషయాల్లో తల దూర్చొద్దని రాజ్ తిట్టేసి వెళ్లిపోతాడు.

IPL_Entry_Point