Veera Simha Reddy Collections: వంద కోట్ల క్లబ్‌లో వీరసింహారెడ్డి.. బాలయ్య మాస్ జాతరకు కాసుల వర్షం-balakrishna veera simha reddy movie joins 100 crore club in just 4 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Movie Joins 100 Crore Club In Just 4 Days

Veera Simha Reddy Collections: వంద కోట్ల క్లబ్‌లో వీరసింహారెడ్డి.. బాలయ్య మాస్ జాతరకు కాసుల వర్షం

వీరసింహారెడ్డికి అదిరిపోయే వసూళ్లు
వీరసింహారెడ్డికి అదిరిపోయే వసూళ్లు

Veera Simha Reddy Collections: నందమూరి బాలకృష్ణ నటించి వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

Veera Simha Reddy Collections: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం విడుదలై నాలుగు రోజుల్లోనే వంద కోట్లపై వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ.104 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మెరుగైన వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా తెలియజేసింది.

వీరసింహారెడ్డి విడుదలైన రోజే రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కాస్త వసూళ్లను తగ్గినప్పటికీ.. అనుకున్న స్థాయిలో తగ్గలేదు. అదిరిపోయే ఓపెనింగ్స్‌తో బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సంబంధిత కథనం