Veera Simha Reddy Success meet: సంక్రాంతికి అదిరిపోయే హిట్ ఇచ్చారు.. సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ స్పష్టం-balakrishna veera simha reddy block buster success meet held in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Block Buster Success Meet Held In Hyderabad

Veera Simha Reddy Success meet: సంక్రాంతికి అదిరిపోయే హిట్ ఇచ్చారు.. సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ స్పష్టం

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్

Veera Simha Reddy Success meet: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోందని తెలిపారు.

Veera Simha Reddy Success meet: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా రికార్డు కలక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వీర మాస్ బ్లాక్‌బాస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని సహా తదితరులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ముందుగా ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘనవిజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యాక్షన్ సినిమా చేద్దామని నేను దర్శకుడు అనుకున్నాం. ఇందుకోసం వీరసింహారెడ్డి కథని ఎంచుకున్నాం. అద్భుతమైన మాటలు సాయి మాధవ్ బుర్రా అందించారు. రామ్-లక్ష్మణ్ పోరాటాలు అద్భుతంగా సాగాయి. ఇందులో నటించిన శృతిహాసన్ చక్కగా నటించారు. దునియా విజయ్‌తో పాటు ఇతర నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా అలరించారు. నా అభిమాని చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరు పేరున అభినందనలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అని బాలకృష్ణ అన్నారు.

అనంతరం దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. "ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నైజాంలో 54 థియేటర్లలో నాలుగు గంటలకు షో పడటం ఓ రికార్డు. రాత్రి పన్నెండుకు ఓపెన్ చేస్తే అరగంటలో టికెట్లన్నీ అయిపోయాయి. బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని వంద శాతం ఫుల్ ఫిల్ చేసుకున్నానని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా ఓ బాధ్యతగా చేశాను. ఉదయం నుంచి నాకు చాలా మంది ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. యూఎస్ఏలో ఈ సినిమా ఇప్పటికే 708K వసూళ్లను సాధించింది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్" అని గోపీచంద్ అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సంబంధిత కథనం