Mahindra EV plant: 10 వేల కోట్లతో మహింద్ర ఈవీ ప్లాంట్; ఇది కూడా ఆ రాష్ట్రంలోనే..-mahindra to set up rs 10 000 crore ev plant in pune ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Ev Plant: 10 వేల కోట్లతో మహింద్ర ఈవీ ప్లాంట్; ఇది కూడా ఆ రాష్ట్రంలోనే..

Mahindra EV plant: 10 వేల కోట్లతో మహింద్ర ఈవీ ప్లాంట్; ఇది కూడా ఆ రాష్ట్రంలోనే..

HT Telugu Desk HT Telugu
Dec 14, 2022 06:15 PM IST

Mahindra to set up EV plant: మహారాష్ట్రలోని పుణెలో విద్యుత్ వాహనాల(Electric Vehecle) కార్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహింద్ర అండ్ మహింద్ర(Mahindra and Mahindra Ltd - M&M) నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Mahindra to set up EV plant: పుణెలో ఇప్పటికే పలు ప్రముఖ వాహన తయారీ సంస్థల ప్లాంట్లు ఉన్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటో, ఫోక్స్ వ్యాగన్, మెర్సెడెజ్ బెంజ్.. తదితర దిగ్గజ కంపెనీలు తమ వాహన తయారీ యూనిట్లను పుణేలో ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా మహింద్ర అండ్ మహింద్ర(Mahindra and Mahindra Ltd - M&M) కూడా అక్కడ ఒక Electric Vehecle ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Mahindra EV plant in Pune: విద్యుత్ వాహనాల కోసం..

పుణెలో రూ. 10 వేల కోట్లతో విద్యుత్ వాహన(Electric Vehecle) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మహింద్ర అండ్ మహింద్ర సంస్థ (Mahindra and Mahindra Ltd - M&M) ప్రకటించింది. థార్, ఎక్స్ యూవీ సిరీస్ వాహనాలు మహింద్ర అండ్ మహింద్ర సంస్థవే. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehecle) ఉత్పత్తి కోసం పుణెలో ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. విద్యుత్ వాహనాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, త్వరలోనే ప్లాంట్ ను సిద్ధం చేస్తామని M&M వెల్లడించింది. విద్యుత్ వాహనాల(Electric Vehecle) తయారీని ప్రోత్సహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రోత్సాహ పథకంలో భాగంగా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ లో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(Born Electric Vehicles - BEVs) శ్రేణిని, అలాగే XUV 700 ఎలక్ట్రిక్ వర్షన్(Electric Vehecle) ను ఉత్పత్తి చేస్తారు. అయితే, ఈ ప్లాంట్ నుంచి పూర్తి ఉత్పత్తి సామర్ధ్యం సాధించడానికి కనీసం 8 సంవత్సరాలు పడుతుందని సంస్థ (Mahindra and Mahindra Ltd - M&M) వెల్లడించింది.

Mahindra to set up EV plant: మహారాష్ట్ర పారిశ్రామిక విధానం

పుణెలో విద్యుత్ వాహన(Electric Vehecle) తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మహింద్ర అండ్ మహింద్ర(Mahindra and Mahindra Ltd - M&M) సమర్పించిన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో అనుమతులు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పరిశ్రమల అనుకూల పారిశ్రామిక విధానం వల్లనే అనేక రంగాలకు చెందిన కంపెనీలు ఆ రాష్ట్రానికి క్యూ కడ్తున్నాయి. గత 70 ఏళ్లుగా మహారాష్ట్ర తమకు హోం స్టేట్ అని, అక్కడే మరో ప్రతిష్టాత్మక Electric Vehecle యూనిట్ ను ప్రారంభించనుండడం సంతోషదాయకమని, తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎం అండ్ ఎం(Mahindra and Mahindra Ltd - M&M) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ తెలిపారు.

Electric vehecles in India: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు

ఏటా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehecle) అమ్మకాలు దాదాపు 30 లక్షలు కాగా, భారత్ లో అవి ఉత్పత్తి అవుతున్నవి కేవలం 1 శాతం లోపే. 2030నాటికి దాన్ని 30 శాతానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Whats_app_banner