Pawan Kalyan : నో డౌట్.. లక్షల్లో పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్.. మరి కార్యకర్తలు?-pawan kalyan have massive fan base but what about janasena activists ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pawan Kalyan Have Massive Fan Base But What About Janasena Activists

Pawan Kalyan : నో డౌట్.. లక్షల్లో పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్.. మరి కార్యకర్తలు?

Anand Sai HT Telugu
Dec 10, 2022 07:30 PM IST

Pawan Kalyan Fans : పవర్ స్టార్.. పవన్ కల్యాణ్.. ఈ పేరు చెప్పగానే అభిమానుల్లో పూనకం వచ్చేస్తుంది. ఏ హీరోకు కనిపించని ఫ్యాన్ బేస్ కనిపిస్తుంది. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి.. వారి ఓట్లు మాత్రం.. పడటం లేదని కిందటి ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది.

పవన్ కల్యామ్
పవన్ కల్యామ్ (twitter)

పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు.. ఏ ఊరికి వెళ్లినా.. ఆయనను చూసేందుకు అభిమానులు క్యూ కడతారు. పవన్ కల్యాణ్ వస్తున్నారంటే.. ఈజీగా తెలిసిపోద్ది. అలా ఉంటారు ఆయన ఫ్యాన్స్. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది కూడా ఆయనకు అభిమానులే. రాజకీయాల్లో(Politics) ఆయనపై విమర్శలు చేసేవారూ చాలామందే ఉన్నారు. నో డౌట్.. పవన్ ఫ్యాన్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికే తెలిసిందే. ఆయన క్రేజ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పవన్ సభలకు వచ్చేవారంతా జనసేన(Janasena) కార్యకర్తలేనా?

ట్రెండింగ్ వార్తలు

ఎంత పెద్ద నాయకుడైనా.. కార్యకర్తలే పార్టీకి బలం. సినిమాల్లో హీరోగా జనాలకు దగ్గరైన పవన్ కల్యాణ్.. పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు. ఈ మధ్య కాలంలో దూకుడు పెంచారు. ఆయన సభ పెడితే.. భారీగా జనం వస్తారు. కానీ ఆ సభలకు వచ్చేది.. కార్యకర్తలేనా? ఎవరిని అడిగినా కాదనే చెబుతారు. పవన్ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు మాత్రమే వస్తారనే కామెంట్స్(Comments) తరచూ వినిపిస్తుంటాయి.

సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువనే విమర్శలు పవన్ పై ఉన్నాయి. ఇటు సినిమా.. మరోవైపు రాజకీయంలో పవన్ ఉన్నారు.. కాబట్టి.. ఇలాంటి కామెంట్స్ చేయడం కామన్. కానీ దీనిపై మాత్రం పవన్ క్లారిటీ ఇచ్చారు. వ్యాపారాలు లేవు కాబట్టి.. నాకు రెండు ముఖ్యమేనని చెప్పారు. గతంతో పోల్చుకుంటే.. ఇటీవలి కాలంలో ఏపీలో జనసేన(Janasena) యాక్టివిటిస్ పెరిగాయి. ప్రజా సమస్యలపైనా పోరాటం చేస్తున్నారు. కార్యాచరణలో భాగంగా.. జిల్లాల్లో కూడా పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో(Next Elections) కీలకమైన శక్తిగా పవన్ ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. జనసేన క్షేత్రస్థాయిలో ఎలా ఉందనేది ముఖ్యం.

చాలా సందర్భాల్లో పవన్ కల్యాణ్(Pawan Kalyan).. తన ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుపులు ఎందుకు అంటూ.. ఆలోచించాలని సూచించారు. ఇప్పటికీ.. పవన్ సభకు వెళ్లిన వారిని పవన్ ఫ్యాన్స్(Pawan Fans) అంటున్నారేగానీ.. జనసేన కార్యకర్తలు అనే మాట మాత్రం తక్కువగా వినిపిస్తుంది. అది కూడా ఓ మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ చూస్తే.. ఎవరికైనా మతిపోతుంది. అలాంటి ఫాలోయింగ్ ఉన్నప్పుడు వారిని కార్యకర్తలుగా మార్చుకోవడంలో జనసేన విఫలమైందని.. మెుదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇందుకు గత ఎన్నికలనే ఉదాహరణగా చూపిస్తారు.

ఇప్పటికీ క్షేత్రస్థాయిలో జనసేన(Janasena)కు బలమైన కేడర్ లేదు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. పవన్ కు ఫ్యాన్స్.. ఎక్కువ జనసేనకు కార్యకర్తలు తక్కువ అని విమర్శ ఉంది. జిల్లాల వారీగా సమీక్షలు చేసి.. బూత్ లెవల్ లో పవన్ పార్టీని.. బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. 'పవన్ ను అభిమానించే.. వారు.. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్.. అని చెబుతున్నారే తప్పా.. జనసేన కార్యకర్తను' అని చెప్పేవాళ్లు తక్కువ మందే ఉంటారు. వ్యక్తిగా పవన్ కల్యాణ్ పవర్ ఫుల్.. అదే సమయంలో పార్టీ కూడా పవర్ ఫుల్ కావాలంటే.. కార్యకర్తల బలమే ముఖ్యమనేది చాలామంది అభిప్రాయం. ఇక్కడే జనసేన మిస్ అవుతుందని చెబుతుంటారు.

కిందిస్థాయిలో చెప్పుకోదగ్గ కార్యకర్తలు.. జనసేనకు లేరు. మండల, గ్రామ కార్యవర్గాలు పూర్తిస్థాయిలో లేవు. ఒకవేళ ఉన్నా.. అందులో చాలామంది పవన్ ను అభిమాన హీరోగా చూసేవారే ఉన్నారనే విమర్శ ఉంది. వారు పార్టీ కార్యకర్తగా పని చేస్తే.. పవన్(Pawan) మరింత శక్తిమంతుడు అవుతాడని.. రాజకీయ విశ్లేషకుల చెప్పేమాట. మండల, గ్రామ కార్యవర్గాలను ఏర్పాటు చేసి.. వారికి సరైన దిశానిర్దేశం చేసే వారిని నియమించాలని చెబుతున్నారు. జిల్లా కార్యాలయలపైనా.. పవన్ దృష్టి పెట్టాలని కొంతమంది అంటున్నారు.

పవన్ పేరు.. చెప్పి సోషల్ మీడియా(Social Media) వార్ చేసే కొంతమంది.. ఆయన కోసం పని చేస్తారా? అనేదే అసలు ప్రశ్న. ఇటీవలి కాలంలో పవన్ వైజాగ్ టూర్, ఇప్పటం ఘటనలతో జనసేన కార్యకర్తలు అనే మాట కాస్త గట్టిగానే వినిపించింది. ఇది కంటిన్యూ చేస్తూ.. పవన్ క్షేత్రస్థాయిలో బర్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కొంతమంది చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ను జనసేన కార్యకర్తలుగా మార్చుకుంటే.. ఓట్ల రూపంలో పవన్ కు భారీగా లాభం చేకూరుతుంది. ఏదైనా సభ పెడితే.. పవన్ ఫ్యాన్స్ వచ్చారు.. అని కాకుండా.. జనసేన కార్యకర్తలు వచ్చారు అనేలా చేసుకున్నప్పుడే ఉపయోగమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికీ కార్యకర్తలు ఎవరు? అభిమానులెవరు? అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది.

IPL_Entry_Point