Navaratri Utsavalu 2022: భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి-huge devotees rush in vijayawada indrakeeladri temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Huge Devotees Rush In Vijayawada Indrakeeladri Temple

Navaratri Utsavalu 2022: భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 09:24 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వరోజు బుధవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు.

భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి (twitter)

Navaratri Utsavalu at Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు

దర్శనానికి సుమారు రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. భవానీలు ఇరుముడి సమర్పించేదుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sri Raja Rajeshwari Devi Darshanam : దేవీ నవరాత్రులలో పదవ అవతారం ఆఖరి రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు విజయదశమిగా చేసుకుంటాం. ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పూజించాలి. అమ్మవారిని గులాబీరంగు వస్త్రముతో అలంకరించాలి. అమ్మవారికి ఈరోజు మహా నైవేద్యముతో నివేదన చేయాలి. పులిహోర, గారెలు, క్షీరాన్నం, దక్షోజనంతో అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి.

అంతేకాకుండా మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారు. త్రేతా యుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాము. ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు.

ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవీ పురాణం తెలియచేస్తుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. ఈ రోజు అమ్మవారిని పూజించి ముహూర్తంతో పని లేకుండా ఏ పని ప్రారంభించినా విజయము పొందుతారని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.

IPL_Entry_Point