Happy Dussehra 2022 : మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా-happy dussehra 2022 wishes images whatsapp messages quotes to share with friends ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Dussehra 2022 : మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా

Happy Dussehra 2022 : మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 05, 2022 08:38 AM IST

Happy Dussehra 2022 : పండుగ అంటేనే బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్లు దగ్గర లేకపోతే ఏమైంది. ఇప్పుడున్న సోషల్ మీడియా మీ సందేశాలను వారికి దగ్గర చేస్తుంది. ఈ విజయదశమి రోజున మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి WhatsApp శుభాకాంక్షలు, సందేశాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు చూసేద్దాం.

దసరా 2022 శుభాకాంక్షలు
దసరా 2022 శుభాకాంక్షలు

Happy Dussehra 2022 : హిందూ పురాణాల ప్రకారం.. మహిషాసురుడు అనే రాక్షసునిపై దుర్గా దేవి సాధించిన విజయాన్ని, రావణుడిపై శ్రీరామ చంద్రుడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా చేసుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయోత్సవంగా భావిస్తారు. దసరా అన్ని చీకటిని అంతం చేసి.. కాంతి ప్రబలంగా ఉండాలనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అందుకే అనేక ప్రాంతాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. ఈ పండుగ సందర్భంగా మీ కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారు మీ దగ్గర లేరని బాధపడకండి. వారికి మీ సందేశాలతో ఇలా శుభాకాంక్షలు తెలిపేయండి.

* మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ కలలన్నింటినీ దేవుడు నెరవేర్చుగాక. దసరా శుభాకాంక్షలు 2022.

* ఇదే వేడుకకు సమయం. చెడుపై మంచి సాధించిన విజయం. అదే “నిజమైన” స్ఫూర్తిని కొనసాగిద్దాం. మనలో చెడుని అంతం చేద్దాం. దసరా శుభాకాంక్షలు 2022!

* మీ కష్టాలు బాణాసంచా వలె పేలుతూ.. మీ ఆనందం పది రెట్లు పెరుగుతుంది. హ్యాపీ దసరా.

* జీవితంలో కొత్త విషయాలను ప్రారంభించడానికి ఒక శుభ దినాన్ని జరుపుకుందాం. దసరా శుభాకాంక్షలు 2022!

* ఈ దసరా మీ జీవితంలో భక్తి, సంకల్పం, అంకితభావాన్ని తెస్తుంది. హ్యాపీ దసరా.

* చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుందాం. దసరా శుభాకాంక్షలు 2022!

* ఈ దసరా రావణ దహనంతో మీ చింతలన్నింటినీ దహించండి. దసరా శుభాకాంక్షలు 2022!

* ఈ దసరా సందర్భంగా మీలోని శ్రీరాముని గుణాలన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు!

* ఆ శ్రీ రాముడు ఎల్లవేళలా... తన ఆశీస్సులను మీపై కురిపిస్తూనే ఉండాలి. మీ జీవితం సంపన్నంగా, ఇబ్బందులు లేకుండా కొనసాగాలి. దసరా శుభాకాంక్షలు!!

సంబంధిత కథనం