AP SI Prelims Exam 2023: నేడే ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష - నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ' -apslrb sub inspector prelims exam 2023 today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apslrb Sub Inspector Prelims Exam 2023 Today

AP SI Prelims Exam 2023: నేడే ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష - నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ'

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 05:10 AM IST

APSLRB SI Prelims Exam Updates: ఇవాళ ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు పలు కీలక సూచనలు చేసింది.

ఇవాళ ఎస్ఐ ప్రాథమిక పరీక్ష
ఇవాళ ఎస్ఐ ప్రాథమిక పరీక్ష

AP Police SI Prelims Exam 2023: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎస్ఐ ప్రిల్సిమ్ ఎగ్జామ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. మొత్తం 291 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తుండగా... ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసింది ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు.

ట్రెండింగ్ వార్తలు

పాటించాల్సిన నిబంధనలు...

అభ్యర్థులు ఒక్క రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి.

అభ్యర్థులను మొదటి పేపర్ పరీక్షకు 9 గంటల తర్వాత.. రెండో పేపర్ పరీక్షకు మధ్యాహ్నం 01 .30 తర్వాల ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు.

ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోనికి అనుమతించరు.

మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, లాగ్‌ టేబుల్‌, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అసలు వాటిని పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దు.

తీసుకువచ్చే వస్తువులను భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవు.

ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి’ అని అభ్యర్థులకు సూచించింది.

హాల్ టికెట్ తో పాటు బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి.

ap police recruitment: ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 411 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా... జనవరి 18వ తేదీతో గడువు ముగిసింది. ఇక ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ ఎగ్జామ్ విధానం:

ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్, ఈవెంట్స్ నిర్వహిస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం