AP Group 1, 2 Notifications : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!-ap group 1 2 notification released soon says appsc chairman gautam sawang ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Group 1, 2 Notification Released Soon Says Appsc Chairman Gautam Sawang

AP Group 1, 2 Notifications : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Bandaru Satyaprasad HT Telugu
May 31, 2023 04:37 PM IST

AP Group 1, 2 Notifications : ఏపీలో త్వరలో గ్రూప్ -1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ సవాంగ్ తెలిపారు. పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్
సీఎం జగన్

AP Group 1, 2 Notifications : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-1, గ్రూప్- 2 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. నోటిఫికేషన్ల జారీకి ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1000 పోస్టులకు పైగా భర్తీ చేసేందుకు గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం పోస్టుల భర్తీపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందించారు. త్వరలో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

జూన్ 3 నుంచి మెయిన్స్ పరీక్షలు

త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు APPSC ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్‌ వెల్లడించారు. జనవరి 8న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ నిర్వహించామన్నారు. పరీక్షలు నిర్వహించిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామన్నారు. ప్రిలిమ్స్ లో 6,455 మంది మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారని సవాంగ్ తెలిపారు. జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్ -1 మెయిన్స్‌ పరీక్షలను 10 జిల్లాల్లో 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఆగస్టులో ఇంటర్వ్యూలు

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని గౌతమ్ సవాంగ్ తెలిపారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే అభ్యర్థులకు గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుందన్నారు. ఆ సమయం దాటితే మాత్రం అభ్యర్థులను లోపలికి అనుమతించబోమన్నారు. జులైలో గ్రూప్ 1 మెయిన్స్‌ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఆగస్టు చివరి నాటికి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

1000 పైగా పోస్టులు

ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు వివరించారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు ఖాళీ ఉండగా, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కి పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ద్వారా మొత్తంగా 1000కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌ -2 పరీక్షలకు సంబంధించి వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలన్నారు.

IPL_Entry_Point