AP EAPCET Results 2023 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్, ఫలితాలు ఎప్పుడంటే?
AP EAPCET Results 2023 : ఏపీ ఎంసెట్(EAPCET 2023) ఫలితాలు ఈ వారంలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. జూన్ 3న ఎంసెట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
AP EAPCET Results 2023 : ఏపీ ఎంసెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 3న ఎంసెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్(AP EAPCET 2023) పరీక్ష నిర్వహించారు. ఏపీ ఎంసెట్ ను మే 15 నుంచి నిర్వహించారు. మే 15 నుంచి 19 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు, మే 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి ఎగ్జామ్స్ నిర్వహించారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది పరీక్ష రాయగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు.
ట్రెండింగ్ వార్తలు
జూన్ 3న ఫలితాలు!
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీ ను ఈఏపీసెట్ ఛైర్మన్ ఇటీవల విడుదల చేశారు. విద్యార్థుల నుంచి కీ పై అభ్యంతరాలను మే 26 వరకు స్వీకరించారు. జూన్ 3న ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేశారు. జూన్ 3న ఫలితాలతో పాటే ఫైనల్ కీని విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక 'కీ' ఇటీవల విడుదల చేశారు. అభ్యంతరాలుంటే మే 26వ తేదీ ఉదయం 9లోపు తెలపాలని గడువు ఇచ్చారు. ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రాథమిక ‘కీ’ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ లోకి విద్యార్థులు లాగిన్ అవ్వొచ్చు.
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్
తెలంగాణ ఎంసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ కౌన్సెలింగ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను చర్చించి, ఖరారు చేశారు. మూడు ఫేజ్ ల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్ లో జులై 21 నుంచి 31 వరకు, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ఆగస్తు 9 వరకు నిర్వహించున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.