AP Assembly Sessions: ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ బిల్లు ఉంటుందా.. ?-ap assembly sessions likely third week of september 2022 full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Sessions: ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ బిల్లు ఉంటుందా.. ?

AP Assembly Sessions: ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ బిల్లు ఉంటుందా.. ?

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 02:56 PM IST

ap assembly sessions 2022: ఈనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మూడో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
త్వరలోే ఏపీ అసెంబ్లీ సమావేశాలు (twitter)

Andhrapradesh Assembly Sessions 2022: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలలలోనే నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 3వ వారంలో జరిగే అవకాశం ఉంది. వారం రోజుల పాటు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

7న కేబినెట్ భేటీ...

ap cabinet meet on september 7th 2022: ఈనెల 7వ తేదీ రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. వాస్తవానికి ఈ సమావేశం సెప్టెంబర్‌ 1న జరగాల్సి ఉంది. కానీ ఈ నెల 31న వినాయక చవితితో పాటు సెప్టెంబర్‌ 1 నుంచి 3 వరకు సీఎం జగన్‌ కడప పర్యటన వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం షెడ్యూల్ బిజీబిజీగా ఉండటంతో సెప్టెంబర్ 7వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది.

అజెండాలో కీలక విషయాలు...

Three Capitals in Andhrapradesh: ఈనెల 7వ జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మూడు రాజధానుల విషయంలో సందిగ్ధత నెలకొనే ఉంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న సర్కార్... ఓసారి బిల్లు తీసుకొచ్చింది. కానీ కోర్టుల జోక్యం, అమరావతి రైతుల నిరసనల నేపథ్యంలో వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి బలమైన బిల్లుతో ముందుకొస్తామని శాసనసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలోనూ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. పలువురు మంత్రులు కూడా కీలకమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే 7వ తేదీన జరిగే భేటీలో కూడా మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే శాసనసభ ముందుకు బిల్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందనే టాక్ నడుస్తోంది.

శాసనసభ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, ప్రస్తావించిన అంశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ... ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. అయితే ఈసారి కూడా ఆ తరహా దృశ్యాలు కనిపించటం ఖాయంగానే కనిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం