Telangana E-pass : స్కాలర్‌షిప్ అప్లై చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?-you can apply ts post matric scholarship 2022 2023 for sc st bc disabled students in telanganaepasscgggovin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  You Can Apply Ts Post Matric Scholarship 2022-2023 For Sc St Bc Disabled Students In Telanganaepass.cgg.gov.in

Telangana E-pass : స్కాలర్‌షిప్ అప్లై చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Anand Sai HT Telugu
Aug 10, 2022 07:15 PM IST

తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

స్కాలర్ షిప్స్
స్కాలర్ షిప్స్

TS Epass Scholarship: తెలంగాణ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను(PMS) మంజూరు చేయడం కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు ఈ-పాస్ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వ వెబ్ సైట్ ఈ-పాస్ (ePass) పోర్టల్‌ నుంచి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, పంపిణీలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఈ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ telanganaepass.cgg.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తు‌దారులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి.

తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు పూర్తి వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ కు వెళ్లి చూడండి.

IPL_Entry_Point