Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!-weather updates of ap and telangana over low pressure in bay of bengal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 03:04 PM IST

low pressure in bay of bengal: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది.

ఏపీ తెలంగాణకు వర్ష సూచన (ఫైల్ ఫొటో)
ఏపీ తెలంగాణకు వర్ష సూచన (ఫైల్ ఫొటో)

Raisn in Telugu States: ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 22 వరకు ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గాలుల వేగం మరింత అవకాశం ఉందన్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వవాల్, వనపర్తి, సూర్యపేట, నల్గొండ, జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.ఇక హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గత కొద్దిరోజులుగా తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పలు ప్రాంతాలను నీటిలో మునిగిపోయాయి. ఇక ఏపీలోని అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందమయ్యాయి.

IPL_Entry_Point