TS Police Recruitment : త్వరలో పార్ట్‌-2 అప్లికేషన్‌‌కు ఎడిట్ ఆప్షన్….-tslprb opportunity to candidates to edit part ii application data ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Police Recruitment : త్వరలో పార్ట్‌-2 అప్లికేషన్‌‌కు ఎడిట్ ఆప్షన్….

TS Police Recruitment : త్వరలో పార్ట్‌-2 అప్లికేషన్‌‌కు ఎడిట్ ఆప్షన్….

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 08:00 AM IST

Ts Police Recruitment రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రదేశాల్లో తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌‌ ‌లో భాగంగా శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహించ నున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పోలీస్‌ నియామక పరీక్షల్లో పార్ట్‌‌-2 పరీక్షలకు అర్హత సాధించిన వారికి శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పార్ట్‌ -2 దరఖాస్తుల్లో పొరపాట్లు చేసిన వారికి ఎడిట్ ఆప్షన్ కల్పించనున్నారు.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు

Ts Police Recruitment : తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఇటీవల దేహదారుడ్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పార్ట్‌-2 పరీక్షలకు దరఖాస్తు చేసే ప్రక్రియను నవంబర్‌ 10వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ మెజర్మెంట్‌, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షల్ని నిర్వహించనున్నారు. త్వరలో ఇందుకోసం అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు.

నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శరీర కొలతలు, శారీరక సామర్ధ్య పరీక్షల్ని తెలంగాణ వ్యాప్తంగా 12 ప్రదేశాల్లో నిర్వహిస్తారు. హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని ప్రాంగణాలతో పాటు అన్ని జిల్లాల వారికి అందుబాటులో ఉండేలా మరో రెండు మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

త్వరలో ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు ....

శరీర సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింద.అడ్మిట్ కార్డులను అర్హత సాధించిన అభ్యర్థులకు నేరుగా పంపనున్నారు. https://www.tslprb.in/ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకరోవాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 25రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి పూర్తి చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 25వ తేదీలోపు సామర్ధ్య పరీక్షలు నిర్వహించే క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అన్నిజిల్లాలకు బోర్డు సమాచారం పంపింది.

మరోసారి ఎడిట్ ఆప్షన్......

పోలీస్ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులకు మరోమారు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని బోర్డు యోచిస్తోంది. పార్ట్‌-2 దరఖాస్తుల్ని పూర్తి చేసే క్రమంలో చాలా మంది అభ్యర్థులు వివరాలను తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిదిద్దుకోడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు. పార్ట్‌-2 అప్లికేషన్‌లో వివరాలను త్వరలోనే ఎడిట్ చేయడానికి వీలు కల్పించనున్నారు. మరోవైపు పార్ట్‌-2 ఫిజికల్ ఫిట్మెస్‌ ప పరీక్షలకు 43,920 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించినా వారిలో 91శాతం మాత్రమే దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోలీస్ పోస్టులకు 5,07,840మంది అభ్యర్థులు అర్హత సాధించినా, 4,63,970మంది మాత్రమే పార్ట్‌-2 పరీక్షలకు హాజరయ్యారు.

IPL_Entry_Point