TS PECET 2023: టీఎస్ పీఈసెట్ - 2023 షెడ్యూల్ విడుదల.. ముఖ్య తేదీలివే-ts pecet 2023 schedule released check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Pecet 2023: టీఎస్ పీఈసెట్ - 2023 షెడ్యూల్ విడుదల.. ముఖ్య తేదీలివే

TS PECET 2023: టీఎస్ పీఈసెట్ - 2023 షెడ్యూల్ విడుదల.. ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 07:14 PM IST

TS PECET 2023 Updates: తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

టీఎస్ పీఈసెట్ -2023
టీఎస్ పీఈసెట్ -2023

TS PECET 2023 Schedule: తెలంగాణలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా పీఈసెట్ 2023 షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రితో కలిసి టీఎస్ పీఈసెట్ క‌న్వీన‌ర్, ప్రొఫెస‌ర్ ఎస్ మల్లేశ్‌ గురువారం విడుదల చేశారు.

టీఎస్ పీఈసెట్ నోటిఫికేష‌న్ మార్చి 13వ తేదీన విడుద‌ల కానుంది. మార్చి 15వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆలస్య రుసంతో మే 15వ తేదీ వరకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 500, మిగ‌తా కేట‌గిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణ‌యించారు. రూ. 5 వేల‌ ఆలస్య రుసుం మే 25వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మే 26వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ ఉంటాయి. జూన్ మూడో వారంలో ఫ‌లితాల‌ు రిలీజ్ అవుతాయి.

NOTE: టీఎస్ పీఈసెట్ 2023 సంబంధించి దరఖాస్తు చేసుకోవటం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవటం, ఫలితాలు, ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు మరికొన్ని అప్డేట్స్ కోసం www.pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇక ఎడ్ సెట్ 2023 షెడ్యూల్ విడుదలైన సంగతి కూడా తెలిసిందే. మే 18వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు. మార్చి 4వ తేదీనే ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది.

షెడ్యూల్ వివరాలు:

మార్చి 4 - ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.

మార్చి 6 - అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 500, ఇత‌ర కేట‌గిరీల అభ్య‌ర్థులు రూ. 700 చెల్లించాలి. ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ. 250 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

మార్చి 30- అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మే 5 - ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మే 18 - ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది.

మే 21 - ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం