TS EAMCET Counselling : ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు
TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
TS EAMCET Counselling 2022:తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచింది సాంకేతిక విద్యాశాఖ. మంగళవారం ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియాల్సి ఉండగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో తాజాగా ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
ts eamcet counselling date extended: సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారి కోసం ధ్రువపత్రాల పరిశీలన స్లాట్ బుకింగ్ గడువును ఎల్లుండి వరకు, ధ్రువపత్రాల పరిశీలన గడువు సెప్టెంబరు 2వరకు పొడిగించింది. వెబ్ ఆప్షన్ల గడువు సెప్టెంబరు 3వరకు పెంచింది.
సీట్ల కేటాయింపు, ట్యూషన్ ఫీజు,సెల్ఫ్ రిపోర్టింగ్ కు సంబంధించిన తేదీలను మాత్రం మార్చలేదు అధికారులు. 3 వేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్న విద్యార్థులకు సెప్టెబర్ 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 6 నుంచి 13 వ తేదీ వరకు వెబ్ సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెబర్ 28న ప్రారంభమై.. అక్టోబర్ 8వ తేదీన ముగియనుంది. ఇంకా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 11న ప్రారంభమై.. 21వ తేదీన ముగియనుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://tseamcet.nic.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
ఎంసెట్‌లో ర్యాంకు సాధించినా.. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాకపోవడంతో సోమవారం వరకు సందిగ్ధత కొనసాగింది. ఈ క్రమంలో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచుతు నిర్ణయం తీసుకున్నారు.
Telangana eamcet counselling schedule:
*సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు
* సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
* సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
* సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
* సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
* అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
* అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
* అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
* అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
* అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఇక అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.