Border House : ఈ ఇంటి వంటగది తెలంగాణలో.. బెడ్ రూమ్స్ మహారాష్ట్రలో..-this house kitchen in telangana bedrooms in maharashtra pays taxes to both states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  This House Kitchen In Telangana Bedrooms In Maharashtra Pays Taxes To Both States

Border House : ఈ ఇంటి వంటగది తెలంగాణలో.. బెడ్ రూమ్స్ మహారాష్ట్రలో..

Anand Sai HT Telugu
Dec 18, 2022 12:17 PM IST

Telangana Maharashtra Border : అప్పుడప్పుడు కొన్ని వింతగా అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా చూస్తే.. నిజమే కదా అనిపిస్తుంది. కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించినా.. ఓ విషయం ఉంది. ఒక ఇంటి కిచెన్ తెలంగాణలో.. బెడ్ రూమ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. విచిత్రంగా అనిపిస్తుందా? అయితే ఆ ఇంటి గురించి తెలుసుకోవాల్సిందే.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఇల్లు
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఇల్లు

కొన్ని విషయాలు అరుదుగా జరుగుతాయి. కాస్త చిత్రంగా అనిపించినా.. అరే.. నిజమే కదా అనిపిస్తుంది. అలాంటి విషయమే ఇప్పుడు చెప్పుకోబోయేది. కోట్లలో ఇలాంటివి కనిపిస్తుంటాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో(maharashtra telangana border) ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి మధ్య నుంచి ఇరు రాష్ట్రాల సరిహద్దు వెళ్తుందన్నమాట. మరి.. ఆస్తి పన్ను ఎలా అనే కదా మీ క్వశ్చన్.. వాళ్లు రెండు రాష్ట్రాలకు ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. వారికి తెలంగాణ, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ(Telangana), మహారాష్ట్ర సరిహద్దుల్లో మహారాజగూడ అనే గ్రామం ఉంది. ఇక్కడే పవార్ కుటుంబ నివసిస్తోంది. వీరు వింత అనుభూతిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటిది ఎవరూ ఎదుర్కొనరేమో. చంద్రాపూర్ జిల్లా సిమావర్తి జీవతి తహసీల్‌లోని మహారాజాగూడ గ్రామంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న పవార్‌ దంపతులు.. ఏళ్ల తరబడి రెండు రాష్ట్రాలకు ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు.

వారు రెండు రాష్ట్రాల లబ్ధిదారుల పథకాలను పొందుతారు. మహారాష్ట్ర, తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లతో సొంత వాహనాలను కూడా కలిగి ఉన్నారు. ఇది వింతగా అనిపించవచ్చు కానీ..నిజం. మహరాజగూడ గ్రామంలో పవార్ కుటుంబానికి 10 గదుల ఇల్లు ఉంది. ఇంట్లో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉండగా, తెలంగాణలోకి నాలుగు గదులు వస్తాయి.

వంటగది తెలంగాణలో ఉండగా, పడకగది, హాలు మహారాష్ట్రలో ఉన్నాయి. 10 గదులున్న ఈ ఇంట్లో ఇద్దరు సోదరులు ఉత్తమ్ పవార్, చందు పవార్ కుటుంబం ఉంటోంది. మెుత్తం 13 మంది నివసిస్తున్నారు. చాలా ఏళ్లుగా వీరు ఇక్కడే ఉంటున్నారు. 1969లో సరిహద్దు సమస్యపై వివాదం పరిష్కరించినప్పుడు.. పవార్ కుటుంబానికి చెందిన భూమి రెండు రాష్ట్రాలుగా విభజించారు. ఇల్లు కూడా అలానే జరిగింది. అయితే ఇరు రాష్ట్రాల్లో ఆస్తిపన్ను చెల్లిస్తున్నందున ఆ కుటుంబానికి నేటికీ ఎలాంటి సమస్య రాలేదు.

ఈ విషయంపై ఉత్తమ్ పవార్ మాట్లాడుతూ..'మా ఇల్లు మహారాష్ట్ర(Maharashtra), తెలంగాణ మధ్య విభజించి ఉంది. కానీ నేటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆస్తిపన్ను చెల్లిస్తున్నాం. రెండు రాష్ట్రాల పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం.' అని పవార్ చెబుతున్నారు.

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని 14 గ్రామాలపై మహారాష్ట్ర, తెలంగాణ రెండూ తమ వాదనలు వినిపించాయి. అందులోని గ్రామాలలో ఒకటి మహారాజగూడ గ్రామం. ఇది రెండు రాష్ట్రాల మధ్య విభజించారు. గ్రామం మాత్రమే కాదు, పవార్ కుటుంబానికి చెందిన 10 గదుల ఇల్లు కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజించేశారు.

కానీ, ఈ ఇంటి విషయం చూస్తే.. చాలా విచిత్రంగానే అనిపిస్తుంది కదా. ఉదయం తెలంగాణ(Telangana)లో భోజనం చేసి.. రాత్రికి మహారాష్ట్రలో నిద్రపోతారు. మెుత్తం పదిగదుల్లో ఎనిమిది గదులను వినియోగిస్తారు. ఆస్తి పన్ను రెండు రాష్ట్రాలకు చెల్లించడంలో వెనకడట్లేదు. అలానే.. రెండు రాష్ట్రాల పథకాలను ఉపయోగించుకుంటున్నారు. నిజంగా ఈ ఇల్లు ప్రత్యేకమైనదే కదా.

IPL_Entry_Point