TS Govt: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!-telagana govt green signal to teachers transfers in state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telagana Govt Green Signal To Teachers Transfers In State

TS Govt: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలు, పదోన్నతులకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!

HT Telugu Desk HT Telugu
Jan 15, 2023 01:18 PM IST

teachers transfers in telangana: టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. టీచర్స్‌ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తెలంగాణలో టీచర్ల బదిలీ
తెలంగాణలో టీచర్ల బదిలీ

telagana govt green signal to teachers transfers :సంక్రాంతి పండగ వేళ ఉపాధ్యాయులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లోనే విడుదల కానున్నట్లు సమచారం.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి చాలా రోజులుగా పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్త్తున్నారు. ఆయా సంఘాలు ప్రభుత్వ తీరుపై విమర్శలు కూడా చేస్తున్నాయి. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని... పలువురు మంత్రులు కూడా చెప్పారు. తాజాగా సంక్రాంతి పండగ వేళ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ కు లైన్ క్లియర్ అయినట్లు అయింది.

కొత్త జిల్లాలకు అనుగుణంగా సర్కార్ ఉద్యోగులను కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీచర్లను కూడా బదిలీ చేశారు. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చేలా ప్రక్రియ చేపట్టారు. ఈ విధానం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు దూరమయ్యారు. ఉపాధ్యాయులుగా ఉన్న భార్యా భర్తలను చెరో జిల్లాకు కేటాయించారు. అ అంశం కూడా పెద్ద గందరగోళమే సృష్టించింది. ఇక కేటాయింపు ప్రక్రియలో సరైన విధానాలన అవలభించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో... ప్రక్రియ ఎలా సాగుతందనేది ఆసక్తికరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరం... ఎలాంటి చిక్కులు రాకుండా ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది.

IPL_Entry_Point