South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - కటక్, కటక్ -సికింద్రాబాద్ మధ్య నడపనుంది. తిరుపతి - సోలాపూర్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......,Secunderabad Cuttack Special Trains: సికింద్రాబాద్ - కటక్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ఆయా తేదీల్లో.. సికింద్రాబాద్ నుంచి రాత్రి 08.30 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 05. 45 నిమిషాలకు కటక్ కు చేరుకుంటుంది.,ఇక కటక్ నుంచి సికింద్రాబాద్ కు కూడా ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు... డిసెంబర్ 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఆయా తేదీల్లో కటక్ స్టేషన్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 08. 30 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.,ఆగే స్టేషన్లు ఇవే...ఈ ప్రత్యేక రైళ్లు... కాజీపేట్, వరంగల్, మహబూబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట్, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్, ఖుర్దా, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుంది.,ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.,తిరుపతికి ప్రత్యేక రైళ్లు..Tirupati Special Trains: ఇక తిరుపతి - సోలాపూర్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్ ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 16.12.2022 - 17.02.2023 మధ్య అందుబాటులో ఉంటుుంది. తిరుపతి నుంచి రాత్రి 09.10 నిమిషాలకు బయల్దేరి...మరునాడు రాత్రి 07. 10 నిమిషాలకు సోలాపూర్ చేరుతుంది. ఇక సోలాపూర్ నుంచి తిరుపతికి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ 15.12.2022 - 16.02.2023 మధ్య అందుబాటులో ఉంటుంది.,ఈ ప్రత్యేక రైళ్లు... బర్సీ, ఉస్మానాబాద్, లాథూర్, ఉద్గిర్, బీదర్, కలబుర్గి, వాడి, యాద్గిర్, మంత్రాలయం రోడ్, ఆదోనీ, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకనలో కోరారు.