TS Weather Alert : వెదర్ అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు-mandous effect rain alert to telangana for coming two days ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Mandous Effect Rain Alert To Telangana For Coming Two Days

TS Weather Alert : వెదర్ అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Telangana Weather Update : మాండూస్ తుపాను ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. తెలంగాణలోనూ మరో రెండ్రోజులపాటు పలు చోట్ల తేలిక నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.

తెలంగాణ(Telangana)లో మరో రెండ్రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతారవణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీన పడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు(Rains) పడనున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గనున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 5 డిగ్రీల మేరత తక్కువగా నమోదు కానునున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ లో 17 డగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమెదు కాగా.. గరిష్టంగా భద్రాచలం(Bhadrachalam)లో 31.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

మాండూస్ తుపాను ఎఫెక్ట్(Mandous Cyclone Effect)తో హైదరాబాద్(Hyderabad)లో ఎడతెరిపి లేకుండా వానపడుతోంది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశానికి చిల్లుపడినట్టుగా పడుతూనే ఉంది. సోమవారం కూడా వర్షం అలానే కురుస్తోంది. ఆకాశం మేఘవృతం అయ్యి ఉంది. తుపాన్ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్(IMD Hyderabad) తెలిపింది.

హైదరాబాద్ లో ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. లక్డికపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, ఫిర్జాదిగూడ, బషీర్‌బాగ్‌, చార్మినార్‌(Charminar), సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అల్వాల్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, పాట్నీ, మౌలాలి, బోడుప్పల్ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు ఏపీలో మాండూస్ ఎఫెక్ట్(Mandous Effect) భారీగానే పడింది. తుపాను అన్నదాతలను భారీగా ముంచింది. రాష్ట్రవాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పంట దెప్బతిన్నది. తమ పొలాల్లోని పంట చూసి అన్నదాతలు కంటనీరు పెడుతున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల్లో అధికారులు ఉన్నారు. బాపట్ల(Bapatla) జిల్లా కృష్ణా డెల్లా పరిధిలో రేపల్లె, బాపట్ల వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వర్షాలకు ముందు కోసి ఆరబెట్టిన సుమారు 30 వేల ఎకరాల్లో వరి కంకులు నీట మునిగాయి. మరో 40 వేల ఎకరాల్లో వరి వర్షానికి నేలకు ఒరిగింది. ఇక వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగానే దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరిధాన్యం పొలాల్లోనే ఉండటంతో.. వర్షపు నీటికి తడిచి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతంలో మిర్చి పంటకు నష్టం భారీగా అయింది.

WhatsApp channel