ED Custody : ఈడీ కస్టడీకి లిక్కర్‌ స్కాం నిందితులు….-enforcement directorate geared up its probe in delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ed Custody : ఈడీ కస్టడీకి లిక్కర్‌ స్కాం నిందితులు….

ED Custody : ఈడీ కస్టడీకి లిక్కర్‌ స్కాం నిందితులు….

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 11:35 AM IST

ED Custody ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్ బోయిన్‍పల్లి, విజయ్‍ నాయర్‍లను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఈడీ కస్టడీలో ఉన్న శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబులతో కలిపి వారిని విచారించనుంది. దర్యాప్తు సమయంలో శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఇచ్చిన సమాచారంతో అభిషేక్, విజయ్ నాయర్‍ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కామ్‌పై రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
లిక్కర్ స్కామ్‌పై రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (HT_PRINT)

ED Custodyఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసులు నమోదైన వెంటనే అరోరా ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. సిబిఐ, ఈడీ విచారణలో అరోరా తనకు తెలిసిన విషయాలను బయటపెట్టాడు. ఆ తర్వాత అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు.

ఢిల్లీలో కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి వచ్చే సమయంలో అరోరా కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. మద్యం జోన్లను దక్కించుకునే విషయంలో ముడుపుల చెల్లింపులో కూడా అరోరా పాత్ర ఉందని భావిస్తున్ననారు. ఈ కేసు దర్యాప్తులో సాక్ష్యమిచ్చేందుకు సిద్దపడటంతో సోమవారం అతడిని న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో దినేష్‌ అరోరా వాంగ్ములాన్ని వీడియో రూపంలో రికార్డు చేశారు. దినేష్‌ అరోరా వాంగ్మూలం ఆధారంగా ఈడీ, సిబిఐలు దూకుడు పెంచాయి. జస్టిస్‌ నాగ్‌పాల్ ఎదుట దినేష్ అరోరా వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. దినేష్ అరోరా వాంగ్ములంతో ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

మరోవైపు సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్ బోయిన్‍పల్లి, విజయ్‍ నాయర్‍లను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఈడీ కస్టడీలో ఉన్న శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబులతో కలిపి వారిని విచారించనుంది. దర్యాప్తు సమయంలో శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఇచ్చిన సమాచారంతో అభిషేక్, విజయ్ నాయర్‍ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో తన పాత్ర ఏమిటో తెలిపేందుకు అప్రూవర్‌గా మారుతున్నట్లు దినేష్ అరోరా న్యాయస్థానానికి స్పష్టం చేశారు. తాను అప్రూవర్‌గా మారడం వెనుక ఎవరి ఒత్తిడి లేదని న్యాయ స్థానానికి తెలియ చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో రాజకీయంగా కూడా అరెస్టులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ చేసిన అరెస్టులన్ని వ్యాపార వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే కీలక నిందితుల్ని ఈడీ అరెస్ట్‌ చేయడంతో వారిచ్చే సమాచారం ఆధారంగా రాజకీయ నాయకుల్ని కూడా టార్గెట్ చేస్తారని భావిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెలుగు చూసిన తొలినాళ్లలోనే టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించింది. తాజాగా వైసీపీకి సన్నిహితుడిగా ముద్రపడిన శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్టులు చివరికి ఎక్కడికి దారి తీస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

IPL_Entry_Point