TS CPGET 2023 : జూన్ 30 నుంచి పీజీ ఎంట్రన్స్ పరీక్షలు - షెడ్యూల్ ఇదే-cpget 2023 exams to be conducted from june 30 in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cpget 2023 Exams To Be Conducted From June 30 In Telangana

TS CPGET 2023 : జూన్ 30 నుంచి పీజీ ఎంట్రన్స్ పరీక్షలు - షెడ్యూల్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 07, 2023 11:50 AM IST

TS Common Post Graduate Entrance Tests: తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 30 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.

తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 2023
తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 2023

TS Common Post Graduate Entrance Tests - 2023: రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్‌-2023) పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ నడుస్తుండగా...ఫైన్ తో జూన్ 20వ తేదీ వరకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అయితే జూన్ 30వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

జులై 10 వరకు పరీక్షలు…

జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు... జులై 10వ తేదీ వరకు ఉండనున్నాయి. మొత్తం 45 కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి.

9:30 am to11:00 am - మొదటి సెషన్

1:00 pm to 2:30 pm - రెండో సెషన్

4:30 pm to 6:00 pm - మూడో సెషన్

ఈ ఏడాదికి సంబంధించి చూస్తే… పలు కోర్సుల్లో ప్రవేశాల్లోనిబంధనలను సడలిస్తూ సంస్కరణలు తీసుకువచ్చారు సీపీగెట్ అధికారులు. ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను తాజాగా ఎత్తేశారు. మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, బయో కెమిస్ట్రీ, న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ ప్రోగ్రామ్‌ కోర్సుల్లో ప్రవేశానికి కెమిస్ట్రీని చదివి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ నిర్ణయంతో బీఎస్సీ (BZC), మైక్రోబయాలజీ, బయాలజీ, జువాలజీ వంటి కాంబినేషన్‌తో డిగ్రీ పూర్తిచేసిన వారు పైన పేర్కొన్న ఆరు సబ్జెక్టుల్లో చేరవచ్చు. తాజాగా డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్‌(Mcom)లో అడ్మిషన్లు పొందవచ్చు. వీరు సీపీగెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కామర్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

2023-24లో ప్రవేశాల కోసం సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా… దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం