Telangana Cabinet : ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు - తొలి కేబినెట్ నిర్ణయాలివే-congress govt first cabinet meeting chaired by cm revanth key decision on free travel for women in tsrtc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet : ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు - తొలి కేబినెట్ నిర్ణయాలివే

Telangana Cabinet : ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు - తొలి కేబినెట్ నిర్ణయాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2023 09:14 PM IST

Telangana Cabinet Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ఆరు గ్యారెంటీల హామీపై చర్చించగా… మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet Latest News: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో… పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 6 గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలు:

-సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు.

-ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచటంపై కేబినెట్ నిర్ణయం.

-ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎంపిక ఉంటుంది.

-డిసెంబర్ 8వ తేదీన పలు గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారు.

-24 గంటల కరెంటు ఇస్తాం.. ఇందుకోసం అధికారులను ఆదేశించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

-గత ప్రభుత్వంలో ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగింది.. రేపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ ఉంటుంది.

-విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

-ఆధార్‌ కార్డ్‌ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

-2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఫైనాన్స్ కి సంబంధించిన ఖర్చు,వేటి కోసం ఖర్చు చేశారనే దానిపై శ్వేతా పత్రం విడుదల చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడి.

-రాబోయే 5 సంవత్సరాలల్లో 24 గంటల విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తాం.

IPL_Entry_Point