TS Independence Day: గోల్కొండ కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా-cm kcr said that telanganas progress has become an example for the country ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Independence Day: గోల్కొండ కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

TS Independence Day: గోల్కొండ కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

HT Telugu Desk HT Telugu
Aug 15, 2023 11:15 AM IST

TS Independence Day: రాష్ట్రం అవతరించిన పదేళ్లలో తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించిందని సిఎం కేసీఆర్ చెప్పారు. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.

తెలంగాణ సిఎం కేసీఆర్
తెలంగాణ సిఎం కేసీఆర్

TS Independence Day: గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.గోల్కొండ కోట వెలుపల పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కోట లోపలి భాగంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పేరెడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. త్రివిధ దళాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో సిఎం పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడి నుంచి గోల్కొండ ప్రాంగణానికి చేరుకున్నారు. గోల్కొండ కోట నుంచి తన సందేశాన్ని వినిపించారు.

ప్రతి ఒక్కరి హృదయంలో దేశంపై ప్రేమాభిమానాలు పెంచుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 75ఏళ్లలో ఆశించిన లక్ష్యాలను దేశం చేరుకోలేకపోయిందని, పాలకుల అసమర్దత వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల జీవితాల్లో అలముకున్న చీకట్లు తొలగిపోలేదన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో అహింసయుతంగా శాంతియుతంగా స్వాతంత్య్రం సాధించుకున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడి పోయిందని, తెలంగాణ సమాజం సమైక్య పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు చెప్పారు. పదేళ్ల క్రితం ఎటు చూసిన దుర్భిక్ష పరిస్థితులు, బీడువారిన భూములు, అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు, బతుకుమీద ఆశ చచ్చి ఊరేసుకున్న చేనేత కార్మికులు, మోరం తేలిన వాకళ్లు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు తెలంగాణలో ఉండేవన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణాన్ని పవిత్ర యజ్ఞంగా భావించి అవిశ్రాంతంగా శ్రమించిందని చెప్పారు. ప్రజల అవసరాలు, అకాంక్షలు అర్థం చేసుకుని అన్ని రంగాలను ప్రక్షాళన చేసిందన్నారు. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్ర స్థానంలో నిలిపినట్లు చెప్పారు. తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందనే పరిస్థితిని చేరుకున్నట్లు చెప్పారు.

పచ్చని పంట పొలాలతో రాష్ట్రం కళకళలాడుతోందని, తరలివస్తున్న కాళేశ్వరం జలధారాలతో తెలంగాణ భూములు తడుస్తున్నాయన్నారు. 20పైగా రిజర్వాయర్లతో 3కోట్ల వరిధాన్యం దిగుబడితో దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. దశాబ్ధంలో తెలంగాణ సాధించిన ప్రగతి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుందన్నారు. తలసరి ఆదాయం, ఉన్నత విద్య, వైద్యం, నీటి సరఫరా వంటి విషయాల్లో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని చెప్పారు.

సంపద పెంచి దేశానికి పంచడంలో అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ 3లక్షలకు పైగా రుపాయల ఆదాయంతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2126యూనిట్ల తలసరి వినియోగంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. విద్యుత్ రంగంలో దేశంలోనే స్ఫూర్తి దాయక చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉందన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి నిరంతర విద్యుత్ ఉపయోగపడిందన్నారు.

కాళేశ్వరంతో పాటు సాగు నీటి ప్రాజక్టుల నిర్మాణంతో తెలంగాణలో స్వర్ణయుగాన్ని సాధించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించి భారతదేశంలో అపూర్వ విజయాన్ని సాధించినట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు పంజాబ్‌ను దాటి అగ్రస్థానానికి చేరిందన్నారు.

వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలనే విపరీత వైఖరికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. పాలమూరు -రంగారెడ్డి వలసల్ని అరికట్టేందుకు లిఫ్ట్‌ స్కీమ్ ప్రారంభించినట్లు చెప్పారు. అన్యాయంగా కోర్టు కేసులు వేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నించారన్నారు. త్వరలోనే సాగునీటి కాల్వల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా అభివృద్ది చేస్తామన్నారు. తాగునీటిఅవసరాల కోసం రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తామన్నారు.

IPL_Entry_Point