MLC Kavitha : మళ్లీ కవితకు నోటీసులు.. ఈసారి ప్లేస్ డిసైడ్ చేయనున్న సీబీఐ-cbi again notices to mlc kalvakuntla kavitha over delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cbi Again Notices To Mlc Kalvakuntla Kavitha Over Delhi Liquor Scam

MLC Kavitha : మళ్లీ కవితకు నోటీసులు.. ఈసారి ప్లేస్ డిసైడ్ చేయనున్న సీబీఐ

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 08:20 AM IST

Delhi Liquor Scam Kavitha Name : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తాము చెప్పిన చోటుకు వచ్చి విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

కవితకు సీబీఐ మరోసారి నోటీసులు
కవితకు సీబీఐ మరోసారి నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో కవితను ఆదివారంనాడు సీబీఐ(CBI) ఏడుగంటలకుపైగా విచారించింది. అయితే మరోసారి నోటీసులు పంపింది. 91సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈసారి మాత్రం కవిత నివాసంలో కాకుండా.. తాము చెప్పిన చోటుకు రావాలని స్పష్టం చేసింది. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, అంతేకాకుండా.. తాము అడిగిన పత్రాలను సమర్పించాలని సీబీఐ చెప్పింది.

నోటీసులు ఎవరు అందుకుంటే.. వాళ్లు మాత్రమే హాజరుకావాలని సీబీఐ(CBI) తెలిపింది. కేసుకు సంబంధించిన.. మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం కావాలని, పత్రాలు సాక్ష్యాలు ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. విచారణ తేదీ, స్థలం విషయం మెయిల్ పంపిస్తామని చెప్పారు.

ఆదివారం సీబీఐకి కవిత్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్(CM KCR) దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆయనతో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అయితే కవిత మీడియాతో మాట్లాడుతారని అంతా అనుకున్నారు. కానీ చివరినిమిషంలో క్యాన్సిల్ చేశారు. సీబీఐ మరో నోటీసు కారణంగానే ఆమె మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది. విచారించిన కాసేపటికే మళ్లీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) విచారణ ఆదివారం నాడు కవిత ఇంట్లోనే జరిగింది. రెండు బృందాల్లో అధికారులు వచ్చారు. ఏడు గంటలకుపైగా విచారణ చేశారు అధికారులు. సీఆర్పీసీ 160 కింద మాత్రమే.. విచారించి.. వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో అధికారులు వచ్చారు. ఇందులో మహిళా అధికారి సైతం ఉన్నారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ లో మీకు ఉన్న సంబంధం ఏంటి?

దిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో పాత్ర ఉందా?

అమిత్ అరోరా గురించి మీకు తెలుసా?

అమిత్ అరోరా ఫోన్ కాల్స్ లో మీ నంబర్ ఎందుకు ఉన్నది?

మీరు 10 ఫోన్లు మార్చారా?

సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా?

రిమాండ్ రిపోర్టులో అమిత్ మీ పేరు ఎందుకు వెల్లడించారు?

విజయ్ నాయర్ ఎవరో తెలుసా?

విజయ్ నాయర్ కు రూ.100 కోట్ల తరలింపులో మీ పాత్ర ఉందా?

లిక్కర్ కంపెనీలకు అనుకూలంగా పాలసీని రూపొందించడంలో మీ పాత్ర ఉందా?

దిల్లీలో ఎక్సైజ్ శాక అధికారులను కలిశారా?

సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా?

సీబీఐ(CBI) అధికారులు.. కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. పైన చెప్పిన ప్రశ్నలు వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నలు వేశారు అధికారులు.

IPL_Entry_Point