Munugodu Results: మునుగోడు గడ్డపై బీజేపీకి భారీ ఓట్లు.. ఇదే ఫస్ట్ టైం..!
Munugodu Results Updates 2022: మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ… బీజేపీ భారీగా ఓట్లు సాధించింది.
Munugodu Bypoll Results: మునుగోడు రిజల్ట్... ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుకాగా... తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఆధిక్యంలోకి రాగా...2, 3 రౌండ్లో మాత్రం బీజేపీ లీడ్ లోకి వచ్చింది. మరోవైపు అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ దూసుకెళ్లింది. మొత్తం 11 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు.
తొలుత చౌటుప్పల్ మండలానికి సంబంధించి.. 4 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌లో బీజేపీపై... కారుపార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. రెండు, మూడో రౌండ్‌లోబీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఆఖరి నాలుగో రౌండ్‌లో.. టీఆర్ఎస్ ముందంజలోకి వచ్చింది. అనంతరం సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ ఓట్ల లెక్కింపును చేపట్టారు.
రికార్డు దిశగా బీజేపీ…
ఈ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ ప్రదర్శన రికార్డు అని చెప్పొచ్చు. గతంలో మునుగోడు గడ్డపై ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేయగా 27 వేలకుపైగా ఓట్లు సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 12 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ప్రస్తుతం సీన్ చూస్తుంటే మాత్రం బీజేపీ...టీఆర్ఎస్ కు ధీటుగా ముందుకువచ్చింది. ఆ పార్టీ అభ్యర్థికి 85 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈ స్థాయిలో బీజేపీకి మునుగోడులో రావటం ఇదే ఫస్ట్ టైం.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయరైంది. ఆ పార్టీకి కేవలం 23 వేల ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఓ దశలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చారు.
ఇక ఐదో రౌండ్ ఫలితాలు ఆలస్యం కావటంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఈ పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ అన్నారు. ఇక ఈ ఎన్నికలో నైతిక విజయం తనదే అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ధర్మం ఓడిపోయి… అధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ పై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.