IPL 2023 Points Table : ఆర్ఆర్ గెలుపుతో పాయింట్ల పట్టికలో మార్పులు ఏంటి?-ipl 2023 latest update points table after pbks vs rr match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Latest Update Points Table After Pbks Vs Rr Match

IPL 2023 Points Table : ఆర్ఆర్ గెలుపుతో పాయింట్ల పట్టికలో మార్పులు ఏంటి?

Anand Sai HT Telugu
May 20, 2023 06:26 AM IST

IPL 2023 Points Table : ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆర్ఆర్ గెలుపుతో పాయింట్ల పట్టికలో కాస్త మార్పులు జరిగాయి.

పంజాబ్ పై రాజస్థాన్ గెలుపు
పంజాబ్ పై రాజస్థాన్ గెలుపు (twitter)

ఆర్ఆర్ పై పంజాబ్ కింగ్స్(RR Vs PBKS) ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ శామ్‌ కరణ్‌, జితేష్‌ శర్మల బాధ్యతాయుత ఆటతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 చేసి.. ప్రత్యర్థి రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals)కు మంచి విజయ లక్ష్యాన్ని అందించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా పంజాబ్ కింగ్స్ ఉంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానానికి ఎగబాకింది. స్టాండింగ్స్‌లో ఉన్న మిగిలిన జట్ల సమాచారం ఈ కింది విధంగా ఉంది.

1. గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌లు ఓడి 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

2. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌లు ఓడి 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.

3. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 13 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచింది, 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం చూడలేదు.

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.

5. రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 7 మ్యాచ్‌లు ఓడిపోయి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

6. ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

7. 13 మ్యాచుల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 7 మ్యాచ్‌లు ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.

8. 14 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

9. 13 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

10. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

WhatsApp channel