Lucky zodiac signs: మూడు గ్రహాల కలయిక.. ఈ 6 రాశుల వారికి మూడింతల లాభాలు, ధన కొరత ఉండదు
Lucky zodiac signs: మేష రాశిలో సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఆరు రాశుల వారికి మూడింతల లాభాలు కలగనున్నాయి.
Lucky zodiac signs: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, నక్షత్రాల మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ప్రజలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని నమ్ముతారు.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహంగా పరిగణించే శుక్రుడు ఏప్రిల్ 24న మేష రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే గ్రహాల రాజు సూర్యుడు, దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాయి. దీని వల్ల మేష రాశిలో శుక్రుడు, సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. మే 1వ తేదీ వరకు మేష రాశిలో త్రిగ్రాహి యోగం ఉంటుంది. తర్వాత బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశిలోకి వెళతాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మేష రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశుల వారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ యోగం ప్రభావంతో ఈ ఆరు రాశుల జాతకులకు ధన కొరత తీరుతుంది.
మిథున రాశి
త్రిగ్రాహి యోగం వల్ల మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. శత్రువులను ఓడిస్తారు. అధికార పార్టీ నుంచి మద్దతు లభిస్తుంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి మీరు జీవితంలోని ప్రతీ రంగంలో గొప్ప విజయాన్ని పొందుతారు.
కన్యా రాశి
సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి కలయిక వల్ల కన్యా రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి అదృష్టానికి త్రిగ్రాహి యోగం తోడవుతుంది. ఫలితంగా వీరి శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మూడు గ్రహాల కలయిక వృశ్చిక రాశి వారికి మూడింతల లాభాలను ఇస్తుంది.
మకర రాశి
త్రిగ్రాహి యోగం ప్రభావంతో మకర రాశి వారికి ఆస్తికి సంబంధించిన వివరాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి చేతికి వస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవిస్తారు. చాలా కాలంగా నిలచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి.
సింహ రాశి
మూడు గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. త్రిగ్రాహి యోగం ప్రభావంతో శుభవార్తలు అందుకుంటారు. నిలిచిపోయిన డబ్బు ఊహించని విధంగా చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లలు, వ్యాపార పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.
కుంభ రాశి
సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి కలయిక కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. కార్యాలయంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు నమోదు చేస్తారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరులతో సత్సంబంధాలు బలపడతాయి.