Trigrahi yogam: బుధుడి సంచారంతో త్రిగ్రాహి యోగం.. వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్
Trigrahi yogam: చాలా ఏళ్ల తర్వాత మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీని ఫలితంగా నాలుగు రాశుల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు. కోరుకున్న స్థలానికి బదిలీ అవుతారు.
Trigrahi yogam: సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. నవగ్రహాలలో అతి చిన్నది, ప్రకాశంవంతమైన గ్రహంగా చెప్తారు. బుధుడి సంచారం వల్ల ఒక వ్యక్తి వ్యాపారంలో రాణించగలుగుతాడు. ప్రస్తుతం బుధుడు మీన రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు.
మీన రాశిలో ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జన్మరాశిలో అయితే త్రిగ్రాహి యోగం ఉంటుందో వారు అదృష్టవంతులుగా మారతారు. ఆర్థిక లాభాలు, కెరీర్లో పురోగతి ఉంటుంది. మీనరాశిలో బుధుడి సంచారంతో చాలాకాలం తర్వాత త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం ప్రభావంతో నాలుగు రాశుల వాళ్ళకి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. వృత్తిలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. ఏయే రాశులకు త్రిగ్రాహియోగం ప్రభావం ఉంటుందో చూద్దాం.
మిథున రాశి
త్రిగ్రాహి యోగం మిథున రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఈ సమయంలో ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబంపై దృష్టి పెడతారు. ఈ కాలంలో కెరీర్ కి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిగతంగా వృద్ధి సాధించే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారేందుకు ఇది అనుకూలమైన సమయం. కెరీర్ కి సంబంధించిన విషయాలలో తీసుకునే అనేక నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. ఈ యోగం ప్రభావంతో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. డబ్బు సంపాదనలో విజయం సాధిస్తారు. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి త్రిగ్రాహి యోగం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. అనేక మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ అవుతారు. సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. నిరుద్యోగులకు ఇష్టమైన కంపెనీలో ఉద్యోగ ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్ధులకు కఠినమైన పోటీ ఇస్తారు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
మకర రాశి
బుధుడి సంచారంతో ఏర్పడే త్రిగ్రాహి యోగం మకర రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీకు మీ కుటుంబానికి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. కష్టపడి పనిచేయడంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీ కష్టాన్ని సీనియర్లు గ్రహించి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. జీతం కూడా పెరుగుతుంది. పనిలో వచ్చే అడ్డంకులు పరిష్కారం అవుతాయి. విజయం సాధిస్తారు. వ్యాపారంలో గణనీయమైన లాభాలు గడిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలు ఇస్తుంది. మీ పనులన్నీ నెరవేరుతాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకు పంపే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వృత్తిలో మంచి పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారికి ఈ కాలంలో విజయం లభిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది.