ఏప్రిల్ 25, నేటి రాశి ఫలాలు.. వీరికి అష్టమ శని వల్ల సమస్యలు, ధనం ఖర్చు చేస్తారు-daily horoscope april 25th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 25, నేటి రాశి ఫలాలు.. వీరికి అష్టమ శని వల్ల సమస్యలు, ధనం ఖర్చు చేస్తారు

ఏప్రిల్ 25, నేటి రాశి ఫలాలు.. వీరికి అష్టమ శని వల్ల సమస్యలు, ధనం ఖర్చు చేస్తారు

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ25.04.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 25వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 25వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 25.04 2024

వారం: గురువారం, తిథి : పాడ్యమి

నక్షత్రం : విశాఖ, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు పనులలో ఒత్తిళ్ళు ఏర్పడినప్పటికీ అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. శారీరక సౌఖ్యం, ఆనందం పొందెదరు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. ప్రయాణాలలో ధనమును ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి సమయం. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం, ఆనందము పొందెదరు. మీ ఆనందం కోసం ప్రయాణములు వంటివి చేసెదరు. ప్రయాణముల కొరకు అధికముగా ధనమును ఖర్చుపెట్టెదరు. స్త్రీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి రోజు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు కలసివచ్చును. ధనలాభము, వస్తులాభం వంటివి కలుగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరముగా గడిపెదరు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. శత్రువుల వల్ల చికాకులు ఏర్పడును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు ఏర్పడు సూచన. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలించును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ శని ప్రభావంచేత సమస్యలు కొంత వేధించును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ధనలాభము, వస్తులాభము కలుగును. ప్రయాణములో చికాకులు ఏర్పడు సూచన. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. లాభము కలుగును. సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలేర్పడును. మీ ఆనందము కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ప్రయాణాలు అనుకూలించును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మార్పు తెచ్చేటటువంటి రోజు. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమగును. ప్రయాణములు అనుకూలించును. వ్యాపారాభివృద్ధి కలుగును. కుటుంబ సభ్యులతో చర్చలలో భేదాభిప్రాయం ఉన్నప్పటికి మీ మాటే నెగ్గును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు అనుకూలించును. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని శనగలను దానమివ్వడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలించును. కుటుంబ సభ్యుల ఆదరణ పొందెదరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. ధనలాభము సౌఖ్యము కలుగును. ఈరోజు కొత్త వస్తువులు లభించును. స్త్రీలకు అనుకూల సమయం. శివపార్వతులు అర్ధానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శారీరక శ్రమ, అలసట కలుగును. సౌఖ్యం పొందినప్పటికి ఏదో విషయం మీద ఆలోచనలు, వేదన కలుగును. అలసత్వం ఏర్పడి ఒత్తిళ్ళకు గురి అయ్యెదరు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోపము వలన నష్టపోయే సూచనలేర్పడుతున్నాయి.శత్రువుల వలన ఇబ్బందులు ఏర్పడును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఒత్తిళ్ళు, చికాకులు కలుగును. ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ధన వ్యయం కలుగు సూచన. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. స్త్రీలకు ఒత్తిళ్ళతో కూడినటువంటి సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభం, వస్తులాభం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయాణములో ధన వ్యయం కలుగు సూచన. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు మార్పు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ధనలాభము, వస్తులాభము కలుగును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు అనుకూలించును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. గొడవల వల్ల మీ ప్రవర్తన వలన ఇబ్బందులు పెరుగును. మీన రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు కలుగును. ధనలాభము, వస్తులాభము కలుగును. ప్రయాణాలలో ధనవ్యయం కలుగు సూచన. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అవేశపూరిత నిర్ణయాలతో సమస్యలధికమగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel