YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో 'ప్లీనరీ' జోష్
- గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కీలక తీర్మానాలకు ఆమోదం పలుకుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇక పార్టీ అధినేత జగన్ ప్రసంగం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది.
- గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కీలక తీర్మానాలకు ఆమోదం పలుకుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇక పార్టీ అధినేత జగన్ ప్రసంగం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది.
(1 / 9)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ వేదికగా కూర్చున్నారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్… మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే… ప్రతిపక్ష టీడీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు.(HT)
(2 / 9)
ప్లీనరీ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత, సీఎం జగన్ కు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. నవరత్నాలతో కూడిన చిత్రపటాన్ని ఇచ్చారు.(HT)
(3 / 9)
ముఖ్యమంత్రి జగన్ చేతికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దట్టీ కట్టారు. ఈ చిత్రంలో కర్నూలు నగర ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కూడా ఉన్నారు.(HT)
(4 / 9)
ప్లీనరీకి హాజరైన కార్యకర్తలకు పార్టీ అధినేత, సీఎం జగన్ అభివాదం చేశారు. వైఎస్ విజయమ్మ కూడా అభివాదం తెలిపారు.(HT)
(5 / 9)
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 175 సీట్లు సాధించాలని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇక సభలో సీఎం జగన్ 2024 - 175/175 పేరుతో కూడిన ఫ్లెక్సీలు భారీగా దర్శనమిచ్చాయి. కార్యకర్తలు వాటిని ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.(HT)
(6 / 9)
ప్లీనరీలో నేతల ప్రసంగం కార్యకర్తల్లో జోష్ ని నింపింది. రెండో రోజు ప్లీనరీలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. నేతల స్పీచ్ కు ఫిదా అయిపోయిన కేడర్… జై జగన్ నినాదాలతో అదరగొట్టారు.(HT)
(7 / 9)
వైసీపీ ప్లీనరీ సందర్భంగా నాగార్జున వర్శిటీ పరిధిలోని రోడ్లన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. భారీగా వాహనాలు తరలిరావటంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. (HT)
(8 / 9)
కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావటంతో రోడ్లపై రద్దీ క్లియర్ కావడానికి గంటల కొద్ది సమయం పట్టింది. ప్లీనరీ సమావేశాల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.(HT)
ఇతర గ్యాలరీలు