Skin Care Tips : శ్రావణమాసం వచ్చేస్తుంది.. మీ స్కిన్ ఇలా గ్లో చేసుకోండి..-skin care tips and skin detox tips for to bright your skin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Skin Care Tips : శ్రావణమాసం వచ్చేస్తుంది.. మీ స్కిన్ ఇలా గ్లో చేసుకోండి..

Skin Care Tips : శ్రావణమాసం వచ్చేస్తుంది.. మీ స్కిన్ ఇలా గ్లో చేసుకోండి..

Published Jul 16, 2022 02:46 PM IST Geddam Vijaya Madhuri
Published Jul 16, 2022 02:46 PM IST

  • Skin Care Tips : శ్రావణమాసం వచ్చిందంటే.. పూజలు, వ్రతాలు, కార్యక్రమాలు, ఫంక్షన్లు. ఇలా హడావిడిగా రోజులు గడిచిపోతుంటాయి. అప్పుడు మీ స్కిన్​పై శ్రద్ధ తీసుకోవడం కష్టం. కాబట్టి ఇప్పటి నుంచి మీ స్కిన్​ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ చిట్కాలతో మీరు మరింత గ్లో పొందుతారు.

మన చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి దానిని సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం గోరువెచ్చని నీరు. ఆ నీటిలో కాటన్ గుడ్డను ముంచి.. దానితో మీ ముఖాన్ని సున్నితంగా తుడవండి. ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని చాలా చక్కగా శుభ్రపరుస్తుంది.

(1 / 7)

ఫేస్ మాస్క్‌లు ఎల్లప్పుడూ మన ముఖాన్ని శుభ్రంగా, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఫేస్ మాస్క్‌ని ఉపయోగించడం మర్చిపోవద్దు. ఇది చర్మంపై ఉన్న మృత కణాలను రిపేర్ చేస్తుంది. మీ చర్మానికి తగిన తేమను అందిస్తుంది.

(2 / 7)

చాలా మంది నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో.. నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగుతారు. నిమ్మకాయలోని సిట్రస్ శరీరానికి అవసరమైన తేమను అందిస్తుంది. శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మం మెరిసిపోతుంది.

(3 / 7)

చెమట, ధూళి పేరుకుపోవడం, చర్మంపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముఖంపై పింపుల్స్ వస్తాయి. కాబట్టి మంచి ఫేస్ స్క్రబ్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమలు, ముడతలను దూరం చేస్తుంది. 

(4 / 7)

మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి మీరు పుష్కలంగా నీరు తాగాల్సిన అవసరం ఉన్నట్లే.. పొడి, నిర్జీవాన్ని పోగొట్టుకోవడానికి మీ చర్మానికి కూడా సరైన తేమ అవసరం. హైడ్రాక్యూర్ ఫేషియల్‌ చేసుకోవడం ద్వారా మీ చర్మానికి తగినంత తేమ అందుతుంది. 

(5 / 7)

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ నీరు తాగడం అవసరం. 8x8 నియమాన్ని అనుసరించడం సులభమయిన మార్గం. రోజంతా 8 గ్లాసుల నీరు తాగాలి. కాబట్టి నిమ్మరసంతో మీ రోజును ప్రారంభించవచ్చు. మంచి యాంటీఆక్సిడెంట్లు మీకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

(6 / 7)

సంబంధిత కథనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు