Russia Ukraine war : చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​.. యుద్ధం ముగిసినట్టేనా?-update 4 putin says russia ready to negotiate over ukraine ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Update 4-putin Says Russia Ready To Negotiate Over Ukraine

Russia Ukraine war : చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​.. యుద్ధం ముగిసినట్టేనా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 25, 2022 05:20 PM IST

Russia Ukraine war latest updates : రష్యా ఉక్రెయిన్​ యుద్ధంలో కీలక పరిణామం! చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. కానీ చర్చలను ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ (REUTERS/file)

Russia Ukraine war latest updates : ఉక్రెయిన్​తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు.

రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Russia Ukraine war : "యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి చేతుల్లోనే ఉంది. చర్చలను మేము అడ్డుకోవడం లేదు. ఉక్రెయిన్​, దాని మిత్ర దేశాలే అడ్డుకుంటున్నాయి," అని ఆరోపించారు పుతిన్​.

ఉక్రెయిన్​పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధానికి దిగింది రష్యా. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉక్రెయిన్​ ప్రవర్తిస్తోందంటూ ఆ దేశంలోకి దూసుకెళ్లింది. తమ లక్ష్యాలు నెరవేరేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని అనేకమార్లు తేల్చిచెప్పింది. మరోవైపు.. తమ భూభాగంలో నుంచి రష్యన్​ సైనికులను తరిమికొట్టేంత వరకు కూడా నిద్రపోమని ఉక్రెయిన్​ ప్రతిజ్ఞ చేసింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి.

Russia Ukraine peace talks : "మా దేశాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాము. సరైన మార్గంలోనే మేము నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మా పౌరులను రక్షించుకోవడానికి వేరే మార్గం లేకుండా పోయింది." అని పుతిన్​ అన్నారు.

అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు.. రష్యాలో చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని అనేకమార్లు ఆరోపించారు పుతిన్​. ఆయన ఆరోపణలను అమెరికా ఖండిస్తూ వచ్చింది.

ఇక ఇప్పుడు.. పాశ్చాత్య దేశాలతో భేదాలు ప్రమాదకర స్థాయికి చేరాయా? అని ఓ జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు.. 'ఇంకా లేదు,' అంటూ జవాబిచ్చారు పుతిన్​.

'చర్చలను అడ్డుకుంటోంది పుతినే..!'

Putin Russia Ukraine war : చర్చలపై పుతిన్​ మాట్లాడుతున్న తీరులో తీవ్రత లేదని ఉక్రెయిన్​ ఆరోపిస్తోంది. చర్చలను తాము అడ్డుకోవడం లేదని, రష్యా అధ్యక్షుడే శాంతికి సిద్ధంగా లేరని విమర్శిస్తోంది. 'ఉక్రెయిన్​పై దాడి చేసింది రష్యానే. మా పౌరులను చంపింది కూడా రష్యానే. ఈ విషయం అందరికి తెలిసిందే. వాస్తవానికి రష్యాకు చర్చలు జరిపే ఉద్దేశం లేదు. బాధ్యతల నుంచి తప్పించుకుని తిరగడమే రష్యా పని,' అని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ సలహాదారు పోడోలైక్​ మండిపడ్డారు.

ఉక్రెయిన్​- రష్యా చర్చలపై సీఐఏ డైరక్టర్​ విలియమ్​ బర్న్స్​ సైతం ఇటీవలే స్పందించారు. చర్చల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారమైపోతాయని అభిప్రాయపడ్డారు. కానీ చర్చలు జరిపే విషయంలో రష్యా సీరియస్​గా లేదని పేర్కొన్నారు.

Putin Zelensky talks : రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం మొదలై 300 రోజులు గడిచిపోయింది. యుద్ధం ముగింపు కోసం ప్రపంచ దేశాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. పుతిన్​ తాజా వ్యాఖ్యలతో యుద్ధం ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం