Russia Ukraine war : ఉక్రెయిన్​పై యుద్ధం కోసం రష్యా ఎంత ఖర్చు చేసింది?-russia ukraine war how much has putin spent on war a quarter of its annual budget ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Ukraine War How Much Has Putin Spent On War? A Quarter Of Its Annual Budget

Russia Ukraine war : ఉక్రెయిన్​పై యుద్ధం కోసం రష్యా ఎంత ఖర్చు చేసింది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 26, 2022 01:52 PM IST

Russia Ukraine war : ఉక్రెయిన్​పై దండయాత్ర కొనసాగిస్తోంది రష్యా. ఫిబ్రవరిలో మొదలైన యుద్ధానికి ఇప్పట్లో ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్​పై యుద్ధం కోసం.. రష్యా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందంటే..

వ్లాదిమిర్​ పుతిన్​
వ్లాదిమిర్​ పుతిన్​ (AFP)

Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం.. తొమ్మిది నెలలుగా సాగుతోంది. యుద్ధానికి ఇప్పటిల్లో ముగింపు పడే సూచనలు కనిపించడం లేదు. కాగా.. ఉక్రెయిన్​పై దండయాత్ర కోసం రష్యా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది? అన్న విషయంపై ఓ డేటా బయటకొచ్చింది. ఫోర్బ్స్​ ప్రకారం.. ఉక్రెయిన్​పై దండయాత్ర కోసం రష్యా ఇప్పటివరకు 82బిలియన్​ డాలర్లను ఉపయోగించింది.

ట్రెండింగ్ వార్తలు

గతేడాది రష్యా బడ్జెట్​ రెవెన్యూ 340బిలియన్​ పౌండ్లు. అంటే.. యుద్ధం కోసం రష్యా.. ఇప్పటివరకు తన బడ్జెట్​లో పావు(క్వార్టర్​) వంతు నిధులను ఉపయోగించింది. ఈ అంచనాలు కేవలం రష్యా మిలిటరీ కార్యకలాపాల కోసం వెచ్చించిన నిధులు మాత్రమే. డిఫెన్స్​ కోసం చేసిన ఖర్చులు, పాశ్చాత్య దేశాల ఆంక్షలతో జరిగిన నష్టం వంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకోలేదు.

Russia expenses on war : దళాలకు ఇవ్వాల్సిన జీతాలు, మృతులు- క్షతగాత్రులైన సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాలు, ఆయుధా ఉత్పత్తి లేదా కొనుగోళ్లు, నష్టపోయిన పరికరాలను తిరిగి భర్తీ చేసే ప్రక్రియ.. మిలిటరీ కార్యకలాపాల ఖర్చుల కిందకు వస్తాయి. ఫోర్బ్స్​ ప్రకారం.. ఇటీవలి కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మొదలైన నాటి కన్నా.. ఇప్పుడు రెట్టింపు ఖర్చు అవుతోంది.

గత నెలలో మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు.. రష్యా 3.5బిలియన్​ డాలర్లు ఇచ్చినట్టు ఫోర్బ్స్​ నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఆర్టిలరీ సప్లై కోసం రష్యా 5.5బిలియన్​ డాలర్లను ఖర్చు చేసినట్టు వివరించింది.

యుద్ధం నేపథ్యంలో.. రష్యా బడ్జెట్​ రెవెన్యూలో.. చమురు, గ్యాస్​ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. అనేక యూరోపియన్​ దేశాలు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణం.

'పుతిన్​.. భయపడుతూ జీవిస్తున్నారు..'

Russia president Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.. భయంలో జీవిస్తున్నారని ఆరోపించారు ఉక్రెయిన్​ మిలిటరీలోని సీనియర్​ అధికారి ఒలెక్సే అరెస్టోవిచ్​. ఖార్సన్​ ప్రాంతం నుంచి రష్యా సైన్యం వెనుతిరుగుతోందని ఆ దేశం ప్రకటన చేసిన నేపథ్యంలో ఒలెక్సే ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఇది పుతిన్​కు భంగపాటు లాంటి ఘటన. యుద్ధం ఓడిపోయిన వారిని రష్యన్​ ప్రజలు క్షమించారు. ఇప్పుడు పుతిన్​ భయపడుతున్నారు. ప్రాణ భయంతో జీవిస్తున్నారు. యుద్ధం ఓడిపోతున్నామని రష్యన్లు మనసులో అనుకున్నా చాలు.. పుతిన్​ కథ ముగిసినట్టే. ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది. ప్రాణాలు కాపాడుకోవడం కూడా కష్టమే," అని ఒలెక్సే తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం