ICICI Bank stock: ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్.. అనలిస్టుల ఫేవరెట్-this banking stock enjoys 98 percent buy ratings highest among nifty stocks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  This Banking Stock Enjoys 98 Percent Buy Ratings Highest Among Nifty Stocks

ICICI Bank stock: ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్.. అనలిస్టుల ఫేవరెట్

Praveen Kumar Lenkala HT Telugu
Aug 11, 2022 02:03 PM IST

ICICI Bank: స్టాక్ మార్కెట్లలో 51 మంది అనలిస్టుల్లో 98 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ కొనుగోలు చేయొచ్చన్న రేటింగ్ ఇచ్చారు.

ఐసీఐసీఐ స్టాక్‌పై అనలిస్టుల బయ్ రేటింగ్
ఐసీఐసీఐ స్టాక్‌పై అనలిస్టుల బయ్ రేటింగ్ (shutterstock)

ICICI Bank stock: ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌పై బ్రోకరేజ్ సంస్థల్లో 98 శాతం ‘కొనొచ్చు’ (buy) రేటింగ్ కలిగి ఉండడం విశేషం. ఎల్ అండ్ టీ (98 శాతం), ఐటీసీ (97 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (96 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (96 శాతం) buy రేటింగ్ కలిగి ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఓ నివేదికలో తెలిపింది. మార్కెట్లో ఏ స్టాక్స్‌ ఫేవరైటో తెలుపుతూ బ్లూమ్‌బర్గ్ రూపొందించిన నిఫ్టీ కాన్‌సెన్సస్ డేటాను ఈ నివేదిక ప్రస్తావించింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం నిఫ్టీ సూచీ 17,600 వద్ద ట్రేడవుతోందని, ఇది 20 వేల వరకు చేరొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 50 కంపెనీల ఏకాభిప్రాయ టార్గెట్ ధరల ఆధారంగా నిఫ్టీ 50 ఇండెక్స్ 13 శాతం పెరిగి 19,717 పాయింట్ల వరకు పెరుగుతుందని అనలిస్టులు అంచనా వేశారు.

ప్రయివేటు బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్, ఎన్‌బీఎఫ్‌సీలు, టెక్నాలజీ, పీఎస్‌యూ బ్యాంకులు, టెలికామ్, కన్జ్యూమర్ తదితర రంగాల కంపెనీలు నిఫ్టీ ఇండెక్స్ పెరిగేందుకు దోహదపడుతాయని అంచనా వేశారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, కన్జ్యూమర్, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచాయని అనలిస్టులు విశ్లేషించారు. టాప్-10 స్టాక్స్ నిఫ్టీ పెరగడంలో 72 శాతం కంట్రిబ్యూట్ చేస్తాయని విశ్లేషించారు.

కాగా ఐసీఐసీఐ బ్యాంక్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ రూ. 6,905 కోట్లుగా నివేదించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 50 శాతం ఎక్కువ. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ (ఎన్ఐఐ), ప్రొవిజన్స్ కేటాయింపుల్లో తగ్గుదల నికర లాభంలో పెరుగుదలకు దోహదపడ్డాయి. వడ్డీ ఆదాయం, వడ్డీ వ్యయం మధ్య అంతరం 21 శాతం మేర పెరిగి రూ. 13,210 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదించింది.

లాభదాయకతను తెలిపే కీలక కొలమానమైన నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం) 1 బేసిస్ పాయింట్ మేర పెరిగి 4.01 శాతంగా ఉంది. అలాగే అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రొవిజన్లు 60 శాతం తగ్గి రూ. 1,144 కోట్లుగా ఉన్నాయి.

ఈ ప్రయివేటు రంగ బ్యాంక్ తన అసెట్ క్వాలిటీ మెరుగుపరుచుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) స్థూల రుణాల్లో 3.41 శాతానికి తగ్గాయి. అలాగే నికర ఎన్‌పీఏ రేషియో 0.7 శాతానికి తగ్గింది.

ఏడాది కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర 24 శాతం మేర పెరిగింది. 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ధర 13 శాతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్ఈలో రూ. 6 లక్షల కోట్లుగా ఉంది.

IPL_Entry_Point