ICICI Bank lending rate: వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్-icici bank raises lending rate by 15 bps ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Icici Bank Raises Lending Rate By 15 Bps

ICICI Bank lending rate: వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 02:44 PM IST

ICICI Bank raises lending rate: ఐసీఐసీఐ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు పెంచింది

వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ
వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ (Bloomberg)

న్యూఢిల్లీ : ఈ వారంలో ఆర్‌బీఐ రెడో రేటు పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం అన్ని కాల వ్యవధులపై తన రుణ రేట్లను 0.15 శాతం పెంచింది.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) సిస్టమ్ కింద అన్ని అవధుల్లో రేట్లు పెంచింది. ఈ చర్య వల్ల MCLR ప్రాతిపదికన రుణాలు పొందిన వారికి ఈఎంఐ భారంగా మారుతుంది.

సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. బ్యాంక్ ఒక సంవత్సరం MCLR 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర.. అంటే 7.90 శాతానికి పెరిగింది. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ 7.65 శాతానికి పెరిగింది.

రిటైల్ రుణాల కోణంలో ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే గృహ రుణాల వంటి దీర్ఘకాలిక రుణాలు ఈ రేటుతో అనుసంధానించి ఉంటాయి.

ఈ వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న తరుణంలో ఈ పెరుగుదలను ప్రకటించింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లను పెంచుతుందని అన్ని వర్గాలూ అంచనా వేస్తున్నాయి.

గత వారం HDFC తన రుణ రేటును 0.25 శాతం పెంచింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (IBHFL) కూడా పోటీ సంస్థలకు అనుగుణంగా హౌసింగ్ లోన్‌లు, MSME లోన్‌లపై రిఫరెన్స్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.

కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి కొత్త కస్టమర్‌లకు, ఆగస్టు 5 నుండి ప్రస్తుత రుణగ్రహీతలకు వర్తిస్తాయి.

IPL_Entry_Point