Not interested feature on IG: పోస్ట్ ఆసక్తిగా లేదా.. నాట్ ఇంట్రెస్టెడ్ ఉందిగా..-not interested in an instagram post soon you can express it on the platform ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Not Interested In An Instagram Post? Soon You Can Express It On The Platform

Not interested feature on IG: పోస్ట్ ఆసక్తిగా లేదా.. నాట్ ఇంట్రెస్టెడ్ ఉందిగా..

Praveen Kumar Lenkala HT Telugu
Sep 01, 2022 04:31 PM IST

Not interested feature on Instagram: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తిగా లేదా? ఆ తరహా పోస్టులు మీ ఫీడ్‌లో కనిపించొద్దనుకుంటున్నారా? దీనికి పరిష్కారంగా ఇన్‌స్టాగ్రామ్ ఓ కొత్త ఫీచర్ తెచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ (Reuters)

Not interested feature on Instagram: సోషల్ నెట్‌వర్క్ దిగ్గజం మెటా తన మల్టీమీడియా సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా రెండు ఫీచర్లు తీసుకొచ్చింది. యూజర్లు చేసే పోస్టింగ్స్ మీకు ఫీడ్‌లో కనిపిస్తాయి. ఆయా పోస్టులు మీకు నచ్చకపోతే ఇక మీరు ‘నాట్ ఇంట్రెస్టెడ్’ అని మార్క్ చేయొచ్చు. నాట్ ఇంట్రెస్టెడ్ అని మార్క్ చేస్తే ఇక ఆ తరహా పోస్టులు మీకు కనిపించవు.

‘ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌పీరియెన్స్ మీకు మరింత నచ్చేలా ఉండేందుకు కొత్తగా రెండు ఫీచర్లు టెస్ట్ చేస్తున్నాం. మీకు ఇన్‌స్టా‌గ్రామ్ ఫీడ్‌లో మీకు కావాల్సిన ఫీడ్ ఎంచుకునేందుకు ఈ ఫీచర్లు సాయం చేస్తాయి. ఇందుకు మీకు కొన్ని కంట్రోల్స్, మెథడ్స్ షేర్ చేస్తున్నాం..’ అని మెటా తెలిపింది.

మీకు ఇన్‌స్టా ఫీడ్‌లో వచ్చే పోస్టులకు నాట్ ఇంట్రెస్టెడ్ అని మార్క్ చేయొచ్చు. దాంతో ఇన్‌స్టా ఫీడ్‌లో సదరు పోస్టులు మీకు కనిపించడం ఆగిపోతుంది. ఆ తరహా పోస్టులు మీకు ఇన్‌స్టా ఫీడ్ చూపించదు.

‘త్వరలోనే దానిని పరీక్షించబోతున్నాం. కొన్ని నిర్ధిష్ట పదాలు, వాక్యాలు, ఎమోజీలు, శీర్షికలు, హాష్‌టాగ్స్ ఉన్న వాటిని మీరు వద్దనుకుంటే అవి ఇకపై కనిపించవు. మీకు సంబంధం లేనిది కనిపించినప్పుడు, ఒకవేళ గతంలో మీకు నచ్చిన అంశాల నుంచి ఇప్పుడు మీరు వేరే అంశాలకు మళ్లితే, మీరు ఈ ఫీచర్ ఉపయోగించి ఫీడ్‌లో మీకు ఆసక్తి లేని కంటెంట్‌ను రాకుండా చేయొచ్చు..’ అని ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు నచ్చినవే చూడాలంటే..

యూజర్లకు నచ్చే అంశాలను బట్టి ప్రాధాన్యక్రమంలో పోస్టులను మీకు ఇన్‌స్టాగ్రామ్ చూపిస్తుంది. అయితే ఒక్కోసారి అవన్నీ మీకు నచ్చేవి అయి ఉండకపోవచ్చు.

Use Favorites and Following: ఫేవరైట్స్, ఫాలోయింగ్ ఫీచర్ వాడండి

ఒక అకౌంట్‌ను మీరు ఫేవరైట్‌గా యాడ్ చేసుకుని ఉంటే, వారి పోస్టులను మీరు ఎక్కువగా చూస్తారు. అంటే తరచుగా మీకు కనిపిస్తాయి. మీ ఫేవరైట్స్‌కు సంబంధించి ఒక డెడికేటెడ్ ఫీడ్ మీకు కనిపిస్తుంది. దాని వల్ల వారి ఫీడ్ మీరు మిస్ అవ్వరు.

ఫాలోయింగ్ బటన్ ద్వారా కేవలం మీరు ఫాలో అయ్యే అకౌంట్ల పోస్టులు మాత్రమే చూస్తారు. ఈ వ్యూలో సజెస్టెడ్ పోస్టులు ఉండవు. అవి చూడడం మిస్సయితే గడిచిన 30 రోజుల పోస్టులు మీకు అందుబాటులో ఉంటాయి.

Use the Not Interested Control: నాట్ ఇంట్రెస్టెడ్ కంట్రోల్ బటన్ యూజ్ చేయండి

నాట్ ఇంట్రెస్టెడ్ టాబ్ ట్యాప్ చేస్తే.. ఆ పోస్టును ఇన్‌స్టాగ్రామ్ మీ ఫీడ్ నుంచి తొలగిస్తుంది. భవిష్యత్తులో ఆ తరహా పోస్టులు ఇక మీకు కనిపించడం తగ్గిపోతుంది. ఆయా పోస్టులు మీకు నచ్చకపోతే ఎక్స్ అనే బటన్ (పోస్ట్‌కు పైన కుడివైపులో ఉంటుంది) క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా.. మీరు త్రీ డాట్ మెనూకు వెళ్లి ‘నాట్ ఇంట్రెస్టెడ్’ టాబ్ నొక్కాలి.

IPL_Entry_Point