Whatsapp latest update: వాట్సాప్ చాట్ నుంచే స్టేటస్ చూసేయొచ్చు..-whatsapp latest update to let you see status directly from chat list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp Latest Update To Let You See Status Directly From Chat List

Whatsapp latest update: వాట్సాప్ చాట్ నుంచే స్టేటస్ చూసేయొచ్చు..

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 04:36 PM IST

Whatsapp latest update: వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెెస్తోంది.

మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్
మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్ (REUTERS)

Whatsapp latest update: వాట్సాప్ తాజాగా మరో అప్‌డేట్ తెస్తోంది. అప్పట్లో ప్రైవసీ దెబ్బతింటోందంటూ యూజర్లు ఆందోళన చెందుతూ సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌ల వెంట పడడంతో ఇక అక్కడి నుంచి మొదలు యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా మరో ఫీచర్‌ టెస్టింగ్‌లో ఉంది. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే స్టోరీ ఫీచరే వాట్సాప్ స్టేటస్. ఈ స్టేటస్ 24 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారు ఇది చూడొచ్చు. చూడాలంటే స్టేటస్ అనే టాబ్ సెలెక్ట్ చేసి, యూజర్ స్టేటస్‌ను నొక్కి చూడాల్సి ఉంటుంది. కానీ తాజాగా వాట్సాప్ తేనున్న ఫీచర్‌తో మరింత సౌకర్యవంతంగా స్టేటస్ చూడొచ్చు.

కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ చాట్ లిస్ట్‌లోనే స్టేటస్ అప్‌డేట్ వీక్షించేందుకు వాట్సాప్ యూజర్లకు వీలు కలుగుతుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.18.17 వెర్షన్ ద్వారా వాట్సాప్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తవగానే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

దాదాపు 200 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లతో అత్యంత ప్రజాధరణ పొందిన చాట్ యాప్స్‌లో ఒకటైన వాట్సాప్.. చాలా వేగవంతంగా అప్‌డేట్లను తెస్తోంది.

ఇటీవలే డెస్క్‌టాప్‌లో వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తెచ్చింది. మొబైల్ సిస్టమ్‌కు లింక్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ప్రత్యేకమైన డెస్క్‌టాప్ యాప్ తెచ్చింది. మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా ఈ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇంకా మీరు గ్రూప్ చాట్స్ నుంచి వెళ్లేటప్పుడు ఇంతకుముందు అందరికీ తెలిసేది. ఇకపై ఎవరికీ తెలియదు. కేవలం అడ్మిన్లకు మాత్రమే తెలుస్తుంది.

అలాగే డిలీట్ చేసిన సందేశాలను కూడా రిస్టోర్ చేయడానికి అనుమతించేలా మరో ఫీచర్‌ తెచ్చింది.

IPL_Entry_Point