WhatsApp new desktop app: వాట్సాప్ న్యూ డెస్క్‌టాప్ యాప్.. ఫీచర్లు ఇవే-whatsapp brings new desktop app for windows users here is what has changed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp Brings New Desktop App For Windows Users Here Is What Has Changed

WhatsApp new desktop app: వాట్సాప్ న్యూ డెస్క్‌టాప్ యాప్.. ఫీచర్లు ఇవే

HT Telugu Desk HT Telugu
Aug 17, 2022 11:51 AM IST

WhatsApp brings new desktop app: వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్ Windowsలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. దీన్ని మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp new desktop app will allow users to receive notifications and messages even when their phone is offline.
WhatsApp new desktop app will allow users to receive notifications and messages even when their phone is offline.

WhatsApp brings new desktop app: డెస్క్‌టాప్ కోసం వాట్సాప్ సరికొత్త యాప్ తీసుకొచ్చింది. అంటే వాట్సాప్ డెస్క్‌టాప్ వినియోగదారులు సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ఇకపై స్మార్ట్‌ఫోన్‌ లింక్ చేయాల్సిన అవసరం లేదు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్‌టాప్ వినియోగదారులు వెబ్ ఆధారిత వాట్సాప్‌ను బ్రౌజర్ ద్వారా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తెచ్చిన సరి కొత్త యాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఫోన్ యాప్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది.

‘కొత్త డెస్క్‌టాప్ మరింత విశ్వసనీయత, మరింత వేగం అందిస్తుంది. ఇది మీ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం రూపొందింది. అందుకు తగిన రీతిలో ఆప్టిమైజ్ అయ్యింది. ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్లు, సందేశాలను యూజర్లు స్వీకరిస్తారు..’ అని వాట్సాప్ వెల్లడించింది.

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందా?

వాట్సాప్ తాజా ఎఫ్ఏక్యూ వెబ్‌పేజీ ప్రకారం.. కొత్త డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి విండోస్‌లో అందుబాటులో ఉంది. దీన్ని మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత

- మీ ఫోన్‌లో వాట్సాప్ తెరవాలి.

- ఇక్కడ ఆండ్రాయిడ్‌లో మరిన్ని ఆప్షన్లు లేదా ఐఫోన్‌లో అయితే సెట్టింగ్‌లపై నొక్కాలి.

- తర్వాత లింక్డ్ డివైజెస్ బటన్ నొక్కాలి.

- మీ వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను మీ ఫోన్ కెమెరాతో స్కాన్ చేయాలి.

మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఆసక్తి ఉన్నవారు ముందస్తు యాక్సెస్ కోసం వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూఐ, డిజైన్ పరంగా కొత్త యాప్ క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న యాప్‌ని పోలి ఉంటుంది. ఈ యాప్‌తో వస్తున్న ఏకైక పెద్ద మార్పు ఏమిటంటే, వాట్సాప్ నోటిఫికేషన్లు, సందేశాలను స్వీకరించడానికి వినియోగదారులు ఇకపై తమ ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ సందేశాలను తొలగించడానికి ఈ సోషల్ మీడియా మెసేంజర్ యాప్ కాల పరిమితిని పొడిగించింది. సందేశాలను తొలగించడానికి 2 రోజుల 12 గంటల సమయం ఉంటుంది.

IPL_Entry_Point