JEE Main 2023 session 2 registration : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎన్‍టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) మంగళవారం ప్రారంభించనుంది. jeemain.nta.nic.in లో జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ ఫామ్‌ను అభ్యర్థులు సమర్పించవచ్చు.,నెల రోజుల పాటు..ఫిబ్రవరి 7న ప్రారంభంకానున్న జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. మార్చ్ 7 వరకు కొనసాగనుంది. అంటే.. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులకు నెల రోజుల సమయం ఉంది. మార్చ్ చివరి వారంలో పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్ట్‌ను విడుదల చేస్తుంది ఏన్టీఏ.,JEE Main 2023 session 2 registration details : ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు రెండుసార్లు అవకాశాన్ని ఇచ్చేందుకు ప్రతియేటా రెండుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తోంది ఎన్‍టీఏ. అభ్యర్థులు సెషన్ 1, లేదా సెషన్ 2లో పరీక్షకు హాజరవచ్చు. రెండింట్లోనూ హాజరయ్యే వెసులుబాటు కూడా ఉంది. రెండిట్లో పరీక్ష రాస్తే.. టాప్ స్కోర్‌ని పరిగణిస్తారు. రెండు సెషన్స్‌కి సంబంధించి ఫలితాలు వెలువడిన తర్వాత.. జేఈఈ మెయిన్ ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది ఎన్‍టీఏ.,జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు..JEE Main 2023 Session 1 results declared- జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 మధ్య జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరిగాయి. జనవరి సెషన్‍లో పేపర్-1 (బీటెక్/బీఈ) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్)కు 46వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. 95.79శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యాయని ఎన్‍టీఏ వెల్లడించింది. ఈ జేఈఈ 2023 సెషన్ -1 పరీక్ష ఫలితాలను ఇప్పడు విడుదల చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,మొత్తం మీద.. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది.,JEE Main 2023 session 2 news : దేశంలోని ప్రముఖ ఎన్ఐటీ, ఐఐటీ, సీఎఫ్టీలలో ప్రవేశల కోసం ఈ జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.,