JEE Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదల.. త్వరలోనే!-jee main 2023 result nta to release session 1 result soon full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదల.. త్వరలోనే!

JEE Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదల.. త్వరలోనే!

Sharath Chitturi HT Telugu
Feb 06, 2023 11:03 AM IST

JEE Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నట్టు తెలుస్తోంది. జనవరి 24- ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.

త్వరలోనే జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదల!
త్వరలోనే జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదల!

JEE Main 2023 Result : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష ఇటీవలే ముగిసింది. పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాగా.. జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలను ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు సమాచారం.

అధికారిక వెబ్​సైట్​లో..

జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలు విడుదలైన తర్వాత.. ఎన్​టీఏ అధికారిక వెబ్​సైట్​ jeemain.nta.nic.in లోకి వెళ్లి విద్యార్థులు తమ స్కోర్​ని, ర్యాంక్​ని చూసుకోవచ్చు. డౌన్​లోడ్​ కూడా చేసుకోవచ్చు.

JEE Main 2023 Result link : ఇక ఈ కాంపిటీటివ్​ ఎగ్జామ్​లోని పేపర్​ 1కు సంబంధించిన ఫైనల్​ ప్రావిజనల్​ ఆన్సర్​ కీని ఎన్​టీఏ విడుదల చేసింది. పేపర్​ 1 (బీఈ/బీటెక్​) ఫైనల్​ ఆన్సర్​ కీని అధికారిక వెబ్​సైట్​లో నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

JEE Main answer key : జేఈఈ మెయిన్​కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ ఏడాది.. 9లక్షలకుపైగా మంది జేఈఈ మెయిన్​ సెషన్​ 1ను రాశారు. జనవరి- ఫిబ్రవరి తొలి వారంలో ఈ పరీక్ష జరిగింది. 9లక్షల మందిలో 8.6లక్షలమంది బీఈ/ బీటెక్​కి రిజిస్టర్​ చేసుకున్నారు. ఇక 0.46లక్షల మంది పేపర్​ 2 బీఆర్క్​, బీప్లానింగ్​కి రిజిస్టర్​ చేసుకున్నారు.

JEE Main 2023 Result date : ఎన్​టీఏ ప్రకారం.. 8.6లక్షల మంది అభ్యర్థుల్లో 8.22లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. అటే అది 95.79శాతం అటెండెన్స్​. జేఈఈ మెయిన్​ సెషన్​ 1ను ఎన్​టీఏ నిర్వహించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక అటెండెన్స్​. ఈ విషయాన్ని ఎన్​టీఏ పేర్కొంది.

జేఈఈ మెయిన్​ సెషన్​ 1 బీఈ/ బీటెక్​ పరీక్ష జనవరి 24, 25, 29, 30, 31- ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించారు. రెండు షిఫ్ట్​లలో పరీక్షలు జరిగాయి. పేపర్​ 2 జనవరి 28న జరిగింది. దేశంలోని 290 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. ఇండియా బయట 25 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

జేఈఈ మెయిన్​ సెషన్​ 1 ఫలితాలను డౌన్​లోడ్​ చేసుకోవడం ఎలా?

JEE Main 2023 Result news : స్టెప్​ 1:- జేఈఈ మెయిన్​ అఫీషియల్​ వెబ్​సైట్​కి వెళ్లాలి.

స్టెప్​ 2:- హోమ్​పేజ్ మీద కనిపించే​ "జేఈఈ మెయిన్​ రిజల్ట్స్​ 2023" అనే లింక్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- మీ అప్లికేషన్​ నెంబర్​ టైప్​ చేయాలి. డేట్​ ఆఫ్​ బర్త్​ టైప్​ చేసి లాగిన్​ అవ్వాలి.

స్టెప్​ 4:- మీ జేఈఈ మెయిన్​ స్కోర్​.. స్క్రీన్​ మీద కనిపిస్తుంది.

స్టెప్​ 5:- డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండో సెషన్​ ఎప్పటి నుంచి?

JEE main session 1 results : దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్​ సెషన్​ 2 పరీక్ష ఏప్రిల్​ 6న ప్రారంభమవుతుంది. ఏప్రిల్​ 12తో ముగుస్తుంది. మొత్తం మీద.. ఇంగ్లీష్​, హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్​, తెలుగు భాషల్లో ఈ జేఈఈ మెయిన్​ ఎగ్జామ్​ జరుగుతుంది.

దేశంలోని ప్రముఖ ఎన్​ఐటీ, ఐఐటీ, సీఎఫ్​టీలలో ప్రవేశల కోసం ఈ జేఈఈ మెయిన్​ పరీక్షను నిర్వహిస్తారు. ఆల్​ ఇండియా ర్యాంకింగ్స్​ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

IPL_Entry_Point