JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ వచ్చేసింది..-jee main 2023 session 1 answer key out at jeemainntanicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023 Session 1: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ వచ్చేసింది..

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ వచ్చేసింది..

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 10:33 PM IST

JEE Main 2023 Session 1 Answer Key: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 (JEE Main 2023 Session 1) కు సంబంధించిన ఆన్సర్ కీ (Answer Key) ని ఎన్టీఏ (NTA) విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీ (Answer Key) ని అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. లో చూడవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 ఆన్సర్ కీ (Answer Key) ని ఎన్టీఏ (NTA) ఫిబ్రవరి 2న విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీ (Answer Key) ని jeemain.nta.nic.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఈ ఆన్సర్ కీ కి సంబంధించి అభ్యర్థుల అభ్యంతరాలను, స్పందనలను, ప్రిలిమినరీ ఆన్సర్ కీ (preliminary answer key)ని, ప్రశ్నాపత్రాన్ని jeemain.nta.nic.in వెబ్ సైట్ లో NTA అప్ లోడ్ చేస్తుంది.

JEE Main 2023 Session 1 Answer Key: అభ్యంతరాలు తెలపడం ఎలా?

విద్యార్థులు జేఈఈ మెయిన్ ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను తెలపవచ్చు. ప్రతీ ప్రశ్నకు కొంత మొత్తాన్ని చెల్లించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. వారి స్పందనలను, అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైతే తగిన మార్పులు చేసి ఫైనల్ ఆన్సర్ కీ (final answer key) ని సిద్ధం చేస్తారు. ఈ ఫైనల్ ఆన్సర్ (final answer key) కీ ని జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main 2023 Session 1) ఫలితాలతో పాటు కానీ, ఆ తరువాత కానీ ప్రకటిస్తారు.

JEE Main 2023 Session 1 Answer Key: సెషన్ 2 కూడా రాయొచ్చు..

విద్యార్థులకు మరో అవకాశం కూడా ఉంది. వారు ఈ సంవత్సరం జరిగే సెషన్ 2 (JEE Main 2023 session 2) పరీక్షకు కూడా హాజరు కావచ్చు. ఈ రెండు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు.. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తాయో, ఆ సెషన్ ను పరిగణనలోకి తీసుకుని ర్యాంక్ నిర్ధారిస్తారు. సెకండ్ సెషన్ పరీక్ష తరువాత ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ లిస్ట్ (JEE Main 2023 all India rank list) ను సిద్ధం చేస్తారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main 2023 session 1) పరీక్ష జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగింది.

JEE Main 2023 Session 1 Answer Key: ఆన్సర్ కీ చూడడం ఎలా?

  • jeemain.nta.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజ్ పై ఉన్న JEE Main Session-1 (2023) – Answer Key Challenge పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి, సబ్మిట్ నొక్కాలి.
  • మీ ఆన్సర్ కీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

IPL_Entry_Point