JEE Mains 2023 Results: జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ (JEE Mains Session-1) 2023 ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ మధ్య జాయింట్ ఇంట్రన్స్ ఎగ్జామ్ (Joint Entrance Exam-JEE) మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జరిగాయి. ఎన్‍ఐటీలు, ఐఐటీలు, సీఎఫ్‍టీల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్‍ను ఎన్‍టీఏ నిర్వహిస్తుంటుంది. జనవరి సెషన్‍లో పేపర్-1 (B.Tech/BE) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్-2 (B.Arch/B.Planning)కు 46వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. 95.79శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యాయని ఎన్‍టీఏ వెల్లడించింది. ఈ జేఈఈ 2023 సెషన్ -1 పరీక్ష ఫలితాలను ఇప్పడు విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్‍టీఏ అధికారిక వెబ్‍సైట్ jeemain.nta.nic.in లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునే ప్రాసెస్, డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి.,JEE Mains 2023 Results: జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలను చెక్ చేసుకోండిలాముందుగా బ్రౌజర్‌లో jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లోకి వెళ్లండి.హోమ్ పేజీలోనే జేఈఈ మెయిన్స్ 2023 రిజల్ట్స్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.అనంతం మీ అప్లికేషన్ నంబర్ సహా అక్కడ అడిగిన లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.ఆ తర్వాత సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ కనపడుతుంది.ఆ రిజల్ట్స్ స్కోర్ కార్డును డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.JEE Mains 2023 Session Results డైరెక్ట్ లింక్ ఇదే: https://ntaresults.nic.in/resultservices/JEEMAIN-auth-23,JEE Mains 2023 Session Results: ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ సెషన్ 1 స్కోర్ కార్డులను ఎన్‍టీఏ ప్రకటించింది. పాసింగ్ పర్సంటేజ్, టాపర్స్ పేర్లను త్వరలోనే వెల్లడిస్తుంది. అప్‍డేట్‍ల కోసం ఎన్‍టీఏ అధికారిక వెబ్‍సైట్‍ను చెక్ చేస్తూ ఉండండి.,JEE Mains 2023 ఐఐటీలు, ఎన్ఐటీలు.. లాంటి కేంద్ర ప్రభుత్వం నడిపే విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) పరీక్షను ఎన్‍టీఏ నిర్వహిస్తుంటుంది. ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ జాతీయ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.