CRPF recruitment 2023 : సీఆర్పీఎఫ్లో ఎస్ఐ, ఏఎస్ఐ వేకెన్సీలకు నోటిఫికేషన్.. వివరాలివే
CRPF recruitment 2023 : సీఆర్పీఎఫ్లో 212 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
CRPF recruitment 2023 : సబ్- ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) వేకెన్సీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్). అప్లికేషన్ ప్రక్రియ మే 1న ప్రారంభమవుతుంది. మే 21లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ను సబ్మీట్ చేయాల్సి ఉంటుంది. rect.crpf.gov.in లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి.. జూన్ 13న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఇది టెంటెటివ్ డేట్. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 24, 25 తేదీల్లో ఉంటుంది.
CRPF recruitment 2023 apply online : సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 వివరాలు:- 212 ఎస్ఐ, ఏఎస్ఐ వేకెన్సీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 వయస్సు పరిమితి:- సబ్- ఇన్స్పెక్టర్ పోస్టు కోసం అప్లై చేస్తున్న అభ్యర్థి వయస్సు 30ఏళ్లు మించి ఉండకూడదు.
అదే సమయంలో అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్ పోస్టుకు అప్లై చేస్తున్న అభ్యర్థి వయస్సు 18-25 మధ్యలో ఉండాలి.
CRPF recruitment 2023 job alert : సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 అప్లికేషన్ ఫీజు:- సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బీ) పోస్టుకు అప్లై చేస్తున్న మేల్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల ఫీజు రూ. 200. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్ సీ) కోసం అప్లై చేస్తున్న మేల్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు rect.crpf.gov.in లోకి వెళ్లాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ రిక్రూట్మెంట్..
UPSC Recruitment 2023 : సూపర్వైజర్తో పాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్). యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. 2023 మే 12తో అప్లికేషన్ గడువు ముగియనుంది. యూపీఎస్సీ నోటిఫికేషన్లోని ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం