BSNL Independence day offer: బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్..-bsnl independence day offers on broadband plans ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bsnl Independence Day Offers On Broadband Plans

BSNL Independence day offer: బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్..

HT Telugu Desk HT Telugu
Aug 12, 2022 05:58 PM IST

BSNL Independence day offer: బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ రూ.449, రూ.599 బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను రూ.275కే అందిస్తోంది. జియో తన ఇండిపెండెన్స్ డే ఆఫర్‌ను ఇదివరకే ప్రకటించింది.

బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు (HT_PRINT)

BSNL Independence day offer: బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రారంభించింది. తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు రూ. 449, రూ. 599 ప్లాన్లను తాజా ఆఫర్ కింద కేవలం రూ. 275కు అందిస్తోంది. 75 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ తన రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు కూడా ఇదే విధమైన ఆఫర్ ప్రవేశపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే 2022 ఆఫర్ వేటిపై

బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఎంపిక చేసిన రీఛార్జ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రూ.449, రూ.599, రూ. 999 సహా మూడు బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్లపై వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే 2022 ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే 2022 ఆఫర్ వివరాలు

బీఎస్ఎన్ఎల్ రూ. 449, రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కేవలం రూ.275కే అందిస్తోంది. అంటే ప్రత్యేక ఆఫర్ కింద రూ. 324 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ ప్లాన్ల ధరను తగ్గించినప్పటికీ ఫీచర్లు యథాతథంగా ఉన్నాయి.

రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల వాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించారు. ఆ తరువాత వినియోగదారులు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఒక వినియోగదారుడు రూ. 599 ప్లాన్ ఎంచుకుంటే రూ. 275 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ వాలిడిటీ ముగిసిన తరువాత ఒరిజినల్ ప్లాన్ అంటే రూ. 599 చెల్లించాల్సి ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు..

బీఎస్ఎన్ఎల్ రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: రూ. 775 చెల్లించి రూ. 999 ప్లాన్ పొందవచ్చు. ఇది కూడా 75 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 150 ఎంబీపీఎస్ వేగంతో 2టీబీ డేటాను వినియోగదారులు పొందుతారు.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, హంగామా, సోనీ లివ్, జీ5, వూట్, యప్ టీవీ, లయన్స్‌గేట్ తదితర యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 30 ఎంబీపీఎస్ హైస్పీడ్ డేటాతో ఈ ప్లాన్‌లో 3.3 టీబీ నెలవారీ డేటా కూడా ఉంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 60 ఎంబీపీఎస్ హైస్పీడ్‌తో 3.3 టీబీ డేటాను అందిస్తుంది.

IPL_Entry_Point