Jio Independence day offer: 365 రోజుల వ్యాలిడిటీ.. రూ. 3 వేల అదనపు బెనిఫిట్స్-reliance jio independence day 2022 offer validity know price and other benefits here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jio Independence Day Offer: 365 రోజుల వ్యాలిడిటీ.. రూ. 3 వేల అదనపు బెనిఫిట్స్

Jio Independence day offer: 365 రోజుల వ్యాలిడిటీ.. రూ. 3 వేల అదనపు బెనిఫిట్స్

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 09:10 AM IST

Jio Independence day offer: జియో ఇండిపెండెన్స్ డే 2022 ఆఫర్ తీసుకొచ్చింది. ఇది 365 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది. రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలతో వస్తుంది.

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్
జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్

Jio Independence day offer: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం స్వాతంత్య్ర దినోత్సవం-2022 ఆఫర్‌ ప్రకటించింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ టెలికాం ఆపరేటర్ తన కస్టమర్లకు రూ. 3,000 విలువైన ప్రయోజనాలతో పాటు ఏడాది పొడవునా వాలిడిటీ అందిస్తోంది.

జియో ఇండిపెండెన్స్ డే 2022 ప్రయోజనాలు

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 2,999 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. ఇది జియో వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రోజువారీగా 2.5 జీబీ డేటా అందిస్తుంది. రోజువారీ డేటా వినియోగ పరిమితి ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్‌కి పడిపోతుంది.

కొత్త ప్లాన్‌ను కంపెనీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ‘జియో రూ. 2999 ఇండిపెండెన్స్ ఆఫర్‌తో స్వేచ్ఛా పండగ జరుపుకోండి. రూ. 3000 విలువైన ఉచిత ప్రయోజనాలను ఆస్వాదించండి..’ అని రిలయన్స్ జియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

కొత్త ప్లాన్‌తో వారి ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకునే జియో వినియోగదారులకు రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. వారు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, మరిన్ని యాప్‌లతో కూడిన జియో సూట్‌కు యాక్సెస్ పొందుతారు.

Jio Independence day offer: ఇతర ప్రయోజనాలు

- 75జీబీ అదనపు డేటా

- 1 సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్

- అజియో నుండి రూ. 750 కూపన్

- నెట్‌మెడ్‌పై రూ. 750 తగ్గింపు

- ఇక్సిగోపై రూ. 750 తగ్గింపు

రిలయన్స్ జియో ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

కొత్తగా ప్రారంభించిన రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ కాకుండా రిలయన్స్ జియో రూ. 2,879, రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్‌లను వార్షిక చెల్లుబాటుతో అందిస్తుంది. జియో రూ. 2,879 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఇది అపరిమిత కాలింగ్, రోజువారీగా 2జీబీ డేటా, జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కస్టమర్‌లు రోజువారీగా 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యంతో పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది.

IPL_Entry_Point